Breaking News

సంజీవ్ గోయెంకా స్పెషల్‌ రిక్వెస్ట్‌..? రిష‌బ్ పంత్ టీమ్‌లోకి కేన్ విలియ‌మ్స‌న్‌

Published on Thu, 10/16/2025 - 10:48

ఐపీఎల్‌-2026 సీజన్ మినీ వేలానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్‌(LSG) కీల‌క నిర్ణ‌యం తీసుకున్నట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్‌ కేన్ విలియమ్సన్‌(Kane Williamson)తో ఎల్‌ఎస్‌జీ ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే విలియమ్సన్ లక్నో జట్టులో ప్లేయర్‌గా కాదు..  స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా చేరనున్నాడంట. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం​..  ఓనర్ సంజీవ్ గోయెంకా సూచన మెరకు లక్నో టీమ్ మెనెజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఐపీఎల్‌-2022 సీజన్‌తో ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్.. ఇప్పటివరకు నాలుగు ఎడిషన్లను పూర్తి చేసుకుంది. ​కానీ యాజమాన్యం అంచనాలను అందుకోవడంలో సూపర్ జెయింట్స్ విఫలమైంది. మొదటి రెండు సీజన్లలో ప్లే ఆఫ్స్‌కి చేరిన లక్నో.. ఆ తర్వాతి రెండు ఎడిషన్‌లలో ఏడో స్ధానానికి పరిమితమైంది. 

మొదట గౌతమ్ గంభీర్, మోర్నే మోర్కెల్ కోచింగ్ స్టాఫ్‌లో ఉండగా ఇప్పుడు జస్టిన్ లాంగర్ ప్రధాన కోచ్‌గా ఉన్నారు. అయితే గ‌త సీజ‌న్‌లో త‌మ జ‌ట్టు మెంటార్‌గా ప‌నిచేసిన టీమిండియా మాజీ ఫాస్ట్ బౌల‌ర్ జ‌హీర్ ఖాన్‌పై ఎల్ఎస్‌జీ వేటు వేసింది. 

అంతేకాకుండా ఐపీఎల్‌-2026 సీజ‌న్‌కు ముందు త‌మ బౌలింగ్ కోచ్‌గా భార‌త మాజీ పేస‌ర్ భ‌ర‌త్ అరుణ్‌ను ల‌క్నో నిమ‌మించింది. ఇప్పుడు ఇంగ్లండ్ మాజీ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్ కార్ల్ క్రోవ్ ల‌క్నో స్పిన్ బౌలింగ్ కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది.

గ‌త రెండు సీజ‌న్ల‌లో గ్రూపు స్టేజికే ప‌రిమిత‌మైన త‌మ జ‌ట్టును కేన్ మామ త‌న అనుభ‌వంతో విజ‌యం ప‌థంలో న‌డిపిస్తాడ‌ని ల‌క్నో భావిస్తోంది. ల‌క్నోలో అద్బుత‌మైన ఆట‌గాళ్లు ఉన్నారు. మార్‌క్ర‌మ్‌, మార్ష్‌, పంత్‌, పూర‌న్ వంటి వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్ల‌తో బ్యాటింగ్ విభాగం ప‌టిష్టంగా ఉన్న‌ప్ప‌టికి.. బౌలింగ్ యూనిట్ మాత్రం వారికి త‌ల‌నొప్పిగా మారింది. 

గత సీజన్‌లో మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, ఆకాష్ దీప్‌, అవేష్ ఖాన్ వంటి పేస‌ర్లు ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయారు. క‌నీసం కేన్ రాక‌తో నైనా ల‌క్నో త‌ల‌రాత మారుతుందో లేదో వేచి చూడాలి. విలియమ్సన్‌ చివరగా ఐపీఎల్‌-2024లో గుజరాత్‌ టైటాన్స్‌ తరపున ఆడాడు.
చదవండి: IND vs AUS: ఆసీస్‌తో తొలి వన్డే.. భారత తుది జట్టు ఇదే! మ్యాచ్ విన్న‌ర్‌కు నో ఛాన్స్‌?

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)