సంజూ శాంసన్‌ ఉదారత

Published on Thu, 06/05/2025 - 12:37

టీమిండియా ఆటగాడు సంజూ శాంసన్‌ ఉదారత చాటుకున్నాడు. తన ఫౌండేషన్ (SSF) తరఫున రానున్న విద్యా సంవత్సరం కోసం 100 మంది విద్యార్థులకు స్కూల్‌ బ్యాగ్‌లు, బూట్లు డొనేట్‌ చేశాడు. తన తల్లి లిజి శాంసన్‌ ఆథ్వర్యంలో ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థులకు స్కూల్‌ సామాగ్రిని ప్రదానం చేయించాడు. పేద విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సంజూ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని క్రికెట్‌ అభిమానులు అభినందిస్తున్నారు. సంజూ గతంలో కూడా తన ఫౌండేషన్‌ తరఫున చాలా సేవా కార్యక్రమాలు చేపట్టాడు.  

ఇదిలా ఉంటే, సంజూ శాంసన్‌ తాజాగా ముగిసిన ఐపీఎల్‌ సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సీజన్‌లో రాయల్స్‌ పెద్దగా పెర్ఫార్మ్‌ చేయలేకపోయింది. ఆ జట్టు 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో సంజూ వ్యక్తిగతంగానూ ఆకట్టుకోలేకపోయాడు. గాయం కారణంగా చాలా మ్యాచ్‌లకు దూరంగా ఉన్న అతను.. ఆడిన మ్యాచ్‌ల్లోనూ స్థాయికి తగ్గ ప్రదర్శనలు ఇవ్వలేకపోయాడు.

ఇంగ్లండ్‌ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత టెస్ట్‌ జట్టులో సంజూ చోటు దక్కించుకోలేకపోయాడు. యువ వికెట్‌కీపర్లు రిషబ్‌ పంత్‌, ధృవ్‌ జురెల్‌, కేఎల్‌ రాహుల్‌ ఈ టూర్‌ కోసం ఎంపిక​ చేసిన జట్టులో స్థానం సంపాదించారు. పంత్‌, రాహుల్‌  జట్టులో పాతుకుపోయిన నేపథ్యంలో సంజూ టెస్ట్‌ కెరీర్‌ దాదాపుగా ముగిసిందనే చెప్పుకోవాలి. ఈ కేరళ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ కేవలం పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు మాత్రమే పరిమితమయ్యాడు.

 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)