మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!
Breaking News
మళ్లీ ప్రేమలో పడ్డ శిఖర్ ధవన్..? వైరల్ వీడియో
Published on Mon, 04/10/2023 - 18:41
ఐపీఎల్-2023లో భాగంగా నిన్న (ఏప్రిల్ 9) సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో అజేయమైన 99 పరుగులు చేసి, తన జట్టు ఓడినా కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్, ఇవాళ ఓ క్రికెటేతర విషయం ద్వారా వార్తల్లోకెక్కాడు. ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న ఓ వీడియోలో ధవన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అత్యంత కీలక విషయాన్ని ఎవరితోనూ షేర్ చేసుకుంటూ కనిపించాడు.
Love is in the air for Shikhar
— Salman (Mohd Ali Shaikh) (@salman3126) April 10, 2023
Dhawan! He has moved on and
found someone in a Delhi Party. #ShikharDhawanLeakedVideo pic.twitter.com/TZhLUyiHBp
ఈ వీడియోలో ధవన్ మాట్లాడుతూ.. ఇటీవలే ఢిల్లీలోని ఓ ఫామ్హౌస్ పార్టీలో ఓ వ్యక్తిని కలిశానని.. ఆమెను తొలి చూపులోనే ప్రేమించానని, ఆమెను చూడగానే తన జీవితంలో ఎన్నడూ లేని క్లారిటీ వచ్చిందని, ఆమెను చూస్తూ అలాగే ఉండిపోయానని.. ఆమె మాట్లాడుతుంటే వింటూ ఉండిపోయానని అన్నాడు. ఆతర్వాత రెండు రోజుల్లో తామిద్దరంలో కలిసి ఇంట్లో ఉన్నామని తెలిపాడు. ఓ వ్యక్తితో సెట్ అవుతుందని అనిపిస్తే వెయిట్ చేయడమెందుకు.. పాత విషయాలను మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించడమేనని చెప్పాడు.
ఈ వీడియోలో ధవన్ ప్రస్తావించిన వ్యక్తి ఎవరన్న విషయం స్పష్టంగా తెలియనప్పటికీ, అతని మాటల ఆధారంగా తన కొత్త జీవితంలోకి వచ్చిన మరో మహిళ అన్న విషయం క్లియర్గా తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో, ధవన్ కొత్త ఇన్నింగ్స్ (పెళ్లి విషయంలో) ప్రారంభించాడని జనాలు అనుకుంటున్నారు. అయితే, ఇది లీక్డ్ వీడియోనా లేక ఏదైనా అడ్వర్టైజ్మెంట్లో భాగమా అన్న విషయం తెలియాల్సి ఉంది. కాగా, 8 ఏళ్ల వివాహ బంధం తర్వాత ధవన్ 2021లో భార్య అయేషా ముఖర్జీతో విడిపోయి, అప్పటినుంచి ఒంటిగా ఉంటున్న విషయం తెలిసిందే.
Tags : 1