Breaking News

భారీ సెంచ‌రీతో చెల‌రేగిన సౌతాఫ్రికా కెప్టెన్‌

Published on Wed, 10/29/2025 - 18:29

ఐసీసీ మహిళల ప్రపంచకప్‌-2025లో భాగంగా గౌహతి వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగింది.

ఓపెనర్‌గా బరిలోకి దిగిన వోల్వార్డ్ ఇంగ్లీష్ బౌలర్లను ఉతికారేసింది. ఆమె కేవలం 115 బంతుల్లోనే తన పదివ వన్డే సెంచరీ మార్క్‌ను అందుకుంది. సెంచరీ పూర్తియ్యాక లారా మరింత చెలరేగిపోయింది. 47వ ఓవర్ వేసిన స్మిత్ బౌలింగ్‌లో వోల్వార్డ్ ఏకంగా 20 పరుగులు పిండుకుంది. 

మొత్తంగా 143 బంతులు ఎదుర్కొన్న లారా వోల్వార్డ్.. 20 ఫోర్లు, 4 సిక్స్‌లతో 169 పరుగులు చేసింది. ఆమెతో పాటు టాజ్మిన్ బ్రిట్స్(45), కాప్‌(42), ట్రయాన్(33) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. సోఫీ ఎక్లెస్టోన్ 4 వి​కెట్లు పడగొట్టగా.. లారెన్‌ బెల్‌ రెండు, నాట్‌ స్కీవర్‌ ఒక్క వికెట్‌ సాధించారు. 

రెండో జట్టుగా రికార్డు..
కాగా వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో సౌతాఫ్రికాకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇంతకుముందు ప్రస్తుత వరల్డ్‌కప్‌లోనే పాకిస్తాన్‌పై 312 పరుగులు ప్రోటీస్‌ సాధించింది.

అదేవిధంగా వరల్డ్‌కప్‌ నాకౌట్‌ మ్యాచ్‌లలో రెండో అత్యధిక టోటల్‌ నెలకొల్పిన జట్టుగా సౌతాఫ్రికా నిలిచింది. ఈ జాబితాలో ఆసీస్‌ అగ్రస్ధానంలో ఉంది. 2022 ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఆసీస్‌ ఏకంగా 356 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసింది.
చదవండి: సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రపంచ రికార్డు

 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)