Breaking News

టీమిండియాతో మ్యాచ్‌.. సౌతాఫ్రికా కెప్టెన్ డ‌బుల్ సెంచ‌రీ

Published on Thu, 10/09/2025 - 21:05

సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ అరుదైన ఘ‌న‌త సాధించింది. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో వోల్వార్డ్ 200 మ్యాచ్‌ల మైలు రాయిని అందుకుంది. మ‌హిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్‌-2025లో వైజాగ్ వేదిక‌గా భార‌త్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా వోల్వార్డ్ ఈ ఫీట్ సాధించింది.

2016లో సౌతాఫ్రికా తరపున ఇంటర్ననేషనల్ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన లారా.. ఇప్పటివరకు 4 టెస్టులు, 112 వన్డేలు, 83 టీ20లు ఆడింది. 26 ఏళ్ల లారా గతేడాది సౌతాఫ్రికా ఆల్‌ఫార్మాట్ కెప్టెన్‌గా ఎంపికైంది. 2024 టీ20 వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికాను ఫైనల్‌కు వోల్వార్డ్ చేర్చింది.

అంతర్జాతీయ మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన మూడవ మహిళా క్రికెటర్‌గా ఆమె కొనసాగుతోంది. ఆమె కెరీర్‌లో ఇప్పటివరకు 9 వన్డే సెంచరీలు, టీ20, టెస్టుల్లో ఒక్కో శతకం సాధించింది. ఓవరాల్‌గా తన అంతర్జాతీయ కెరీర్‌లో 7013 పరుగులు చేసింది. 

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.5 ఓవ‌ర్ల‌లో 251 ప‌రుగుల‌కు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రిచా ఘోష్‌ అద్బుతమైన పోరాటం కనబరిచింది. కేవ‌లం 77 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 94 ప‌రుగులు చేసింది. ఆమెతో పాటు ప్ర‌తికా రావ‌ల్‌(37), స్నేహ్ రాణా(33) రాణించారు. సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో క్లోయ్ ట్రయాన్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. మారిజాన్ కాప్, మ‌ల్బా, నాడిన్ డి క్లెర్క్ త‌లా రెండేసి వికెట్లు ప‌డ‌గొట్టారు.
చదవండి: డ‌బ్ల్యూపీఎల్ మెగా వేలానికి ముహూర్తం ఖరారు..! నిబంధ‌న‌లు ఇవే?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)