Breaking News

చోకర్స్‌ కాదు... విన్నర్స్‌

Published on Sun, 06/15/2025 - 01:13

దాదాపు ఏడాది క్రితం దక్షిణాఫ్రికా జట్టు భారత్‌తో టి20 వరల్డ్‌ కప్‌ ఫైనల్లో తలపడింది.  177 పరుగుల లక్ష్య ఛేదనలో ఒక దశలో చేతిలో 6 వికెట్లతో 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచింది. ఇక విజయం లాంఛనమే అనిపించగా...చివరకు 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డగౌట్‌లో కూర్చుకున్న కెప్టెన్‌ మార్క్‌రమ్‌ కన్నీళ్లపర్యంతమైన దృశ్యం దక్షిణాఫ్రికా అభిమానులకు కలచివేసింది. ఇప్పుడు సంవత్సరం తిరగక ముందే అతను సఫారీ ఫ్యాన్స్‌ దృష్టిలో హీరోగా మారిపోయాడు. 

ఆస్ట్రేలియా ‘బౌలింగ్‌ చతుష్టయం’ను ఎదుర్కొని దక్షిణాఫ్రికా 282 పరుగులు సాధించగలదా అనే సందేహాల మధ్య అతను అసాధారణ బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ‘డకౌట్‌’ అయినా రెండో ఇన్నింగ్స్‌లో ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పట్టుదలగా తన కెరీర్‌లో అత్యంత విలువైన ఇన్నింగ్స్‌ ఆడి జట్టును గెలిపించాడు. కెపె్టన్‌ తెంబా బవుమా విజయగాథ కూడా ఇలాంటిదే. 64 టెస్టుల కెరీర్‌లో కేవలం 4 సెంచరీలే సాధించిన అతను ప్రతీసారి తీవ్ర విమర్శలే ఎదుర్కొన్నాడు. 

‘బ్లాక్‌ ఆఫ్రికన్‌’ కాబట్టి టీమ్‌లో చోటు దక్కిందని, రిజర్వేషన్‌ కారణంగానే కొనసాగుతున్నాడని వ్యాఖ్యలు వినిపిస్తూ వచ్చాయి. తాజా ఘనతతో బవుమా నాయకుడిగా ఆకాశమంత ఎత్తున నిలిచాడు. ఫైనల్‌కు ముందు తన కెపె్టన్సీలో ఆడిన 9 టెస్టుల్లో 8 మ్యాచ్‌లు గెలిపించి ఓటమి ఎరుగని అతను...ఇప్పుడు టీమ్‌ను వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచి పొట్టివాడు అయినా గట్టివాడే అని నిరూపించాడు. మార్క్‌రమ్, బవుమా 147 పరుగుల భాగస్వామ్యం ఆ్రస్టేలియా ఆట కట్టించేలా చేసింది. డ్రగ్స్‌ వివాదం నుంచి బయటపడిన రబాడ 9 వికెట్లతో సఫారీ విజయానికి పునాది వేయగా, రెండో ఇన్నింగ్స్‌లో ఇన్‌గిడి తన విలువ చాటాడు.  

విమర్శలను అధిగమించి... 
దక్షిణాఫ్రికా జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించినా...ఆ జట్టుపై పెద్దగా అంచనాలు లేవు. ఎదురుగా బలమైన ఆస్ట్రేలియాలాంటి ప్రత్యర్థి ఉండటంతో పాటు టీమ్‌లో అనుభవలేమి స్పష్టంగా కనిపించింది. టాప్‌–7 బ్యాటర్లతో పాటు ఆల్‌రౌండర్‌ యాన్సెన్‌ మొత్తం టెస్టు పరుగులు కలిపినా... ఒక్క స్టీవ్‌ స్మిత్‌ సాధించిన పరుగులకంటే తక్కువగా ఉన్నాయి! పైగా స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్, లయన్‌ కలిసి ఆసీస్‌కు ఎన్నో అద్భుత విజయాలు అందించారు. అలాంటి బౌలింగ్‌ను ఎదుర్కొని గెలవడం దాదాపు అసాధ్యమని అనిపించింది. 

అన్నింటికి మించి సఫారీ టీమ్‌ ఫైనల్‌కు చేరిన క్రమంపై విమర్శలు ఉన్నాయి. 2023–25 డబ్ల్యూటీసీ సైకిల్‌లో అగ్రశ్రేణి టీమ్‌లైన ఇంగ్లండ్, ఆ్రస్టేలియాలను ఒక్క టెస్టులోనూ ఎదుర్కోని టీమ్‌... సొంతగడ్డపై భారత్‌ చేతిలో 55కు ఆలౌటై చిత్తుగా ఓడింది. వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్‌లాంటి బలహీన ప్రత్యర్థులపై (వరుసగా 7 టెస్టులు) గెలిచి ఫైనల్‌ చేరిందని వ్యాఖ్యలు వచ్చాయి. అయితే ఫైనల్‌కు ముందు ‘అదంతా మా చేతుల్లో లేదు. 

ఈ ఒక్క మ్యాచ్‌ గెలిస్తే దానిని ఎవరూ పట్టించుకోరు’ అంటూ స్పష్టంగా చెప్పిన బవుమా దానిని చేసి చూపించాడు. ఆ్రస్టేలియాను ఓడిస్తేనే వరల్డ్‌ చాంపియన్‌గా భావిస్తాం అనేవారికి సమాధానం ఇచ్చాడు. స్వదేశంలో టి20 లీగ్‌ కోసం ప్రధాన ఆటగాళ్లతో కాకుండా ద్వితీయ శ్రేణి జట్టును న్యూజిలాండ్‌ పంపగా 0–2తో టీమ్‌ చిత్తయింది. అయినా సరే చివరకు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు జట్టు అర్హత సాధించడం విశేషం.  

ఆనందం దక్కింది... 
అంతర్జాతీయ క్రికెట్‌లోకి 1991లో దక్షిణాఫ్రికా పునరాగమనం చేసింది. ఆ తర్వాత 1992 వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో వర్షం నిబంధనతో ఓడిన జట్టు, 1996లో అన్ని లీగ్‌లు గెలిచి క్వార్టర్స్‌లో అనూహ్యంగా ఓడింది. 1998తో క్రానే, కలిస్, రోడ్స్, బౌచర్‌లతో కూడిన జట్టు తొలి చాంపియన్స్‌ ట్రోఫీని గెలిచి ఆనందం పంచింది. అయితే ఆ తర్వాతే జట్టు రాత పూర్తిగా మారిపోయింది. గత ఏడాది టి20 వరల్డ్‌ కప్‌కు ముందు వరకు ఒక్క ఐసీసీ టోర్నీలోనూ ఫైనల్‌ చేరలేకపోయింది. 

1999 సెమీస్‌లో ‘టై’తో గుండె పగలగా, సొంతగడ్డపై 2003లో మళ్లీ వర్షంతో లెక్క తప్పడంతో సెమీస్‌ కూడా చేరలేకపోయింది. ఆ తర్వాత మూడు సార్లు సెమీస్‌ వరకు చేరడంలో సఫలమైంది. స్వదేశంలో 2007 టి20 వరల్డ్‌ కప్‌లో సెమీస్‌ చేరని జట్టు తర్వాత రెండు సార్లు సెమీస్‌లోనే ఓడింది. చాంపియన్స్‌ ట్రోఫీలో ఐదు సార్లు సెమీస్‌కే పరిమితమైంది. వేర్వేరు కారణాలతో వచ్చిన ఈ ఓటములతో టీమ్‌లో నైరాశ్యం నెలకొంది.

 ఆ తర్వాత దక్షిణాఫ్రికా బోర్డులో రాజకీయాలు, ఆర్థిక సంక్షోభం తదితర కారణాలతో జట్టు ఆటపై కూడా ప్రభావం పడింది. వరుస ఓటములతో టీమ్‌ వెనుకబడిపోవడంతో ఇతర టీమ్‌ల దృష్టిలో అది ద్వితీయ శ్రేణి జట్టుగా మారిపోయింది. అయితే తాజా విజయం సఫారీ టీమ్‌లో కొత్త ఉత్సాహం తీసుకు రానుంది. 2027 వన్డే వరల్డ్‌ కప్‌ కూడా అక్కడే జరగనున్న నేపథ్యంలో ఈ విజయం వారిలో జోష్‌ నింపడం ఖాయం. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)