Breaking News

19 ఏళ్ల వయస్సులో సంచలనం.. సౌతాఫ్రికా ప్లేయర్‌ వరల్డ్‌ రికార్డు

Published on Sun, 08/10/2025 - 21:21

డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో సౌతాఫ్రికా యువ పేస‌ర్ క్వేనా మఫాకా అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. 19 ఏళ్ల మ‌ఫాకా త‌న పేస్ బౌలింగ్‌తో ప్ర‌త్య‌ర్ధి బ్యాట‌ర్ల‌ను బెంబెలెత్తించాడు. టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, బెన్ డ్వార్షుయిస్, జంపాల‌ను యువ సంచ‌ల‌నం పెవిలియ‌న్‌కు పంపాడు.

మఫాకా మొత్తంగా త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో కేవ‌లం 20 ప‌రుగులు మాత్ర‌మే 4 వికెట్ల‌ను ప‌డగొట్టాడు. ఈ క్ర‌మంలో స‌ఫారీ స్పీడ్ స్టార్ ఓ వ‌ర‌ల్డ్ రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు.

తొలి ప్లేయర్‌గా.. 
అంత‌ర్జాతీయ టీ20ల్లో పూర్తి స‌భ్య దేశాల‌(టెస్టు హోదా క‌లిగిన జ‌ట్లు) నుంచి నాలుగు వికెట్ల హాల్ సాధించిన  అతి పిన్న వయస్కుడిగా మ‌ఫాకా చ‌రిత్ర సృష్టించాడు. మఫాకా కేవలం 19 సంవత్సరాల 124 రోజుల వయస్సులో ఈ ఫీట్ సాధించాడు.

ఇంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ వేన్ పార్నెల్ పేరిట ఉండేది. పార్నెల్ 2009లో వెస్టిండీస్‌పై 19 సంవత్సరాల 318 రోజుల వయస్సులో ఫోర్ వికెట్ల హాల్ సాధించాడు. తాజా మ్యాచ్‌తో పార్నెల్ ఆల్‌టైమ్ రికార్డును మఫాకా బ్రేక్ చేశాడు.

అదేవిధంగా టీ20ల్లో ఆస్ట్రేలియాపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన సఫారీ బౌలర్‌గా కూడా మఫాకా నిలిచాడు. ఇంతకుముందు రికార్డు కైల్‌ అబాట్‌, తహీర్‌, వైస్‌ పేరిట ఉండేది. వీరిముగ్గురూ కూడా ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్‌లో 21 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. తాజా మ్యాచ్‌తో ఈ త్రయాన్ని మఫాకా అధిగమించాడు. కాగా తొలి టీ20లో​ ఆస్ట్రేలియా చేతిలో 17 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఓటమిపాలైంది.
చదవండి: ఆసియాక‌ప్ గెలిచేది ఆ జ‌ట్టే: సౌరవ్‌ గంగూలీ
 

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)