Breaking News

ఇంగ్లండ్‌ గడ్డ మీద సత్తా చాటిన టీమిండియా స్టార్‌

Published on Sat, 07/25/2026 - 12:02

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఇంగ్లండ్‌ గడ్డ మీద సత్తా చాటాడు. దేశీ వన్డే కప్‌ మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టి.. యార్క్‌షైర్‌ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. కాగా అఫ్గానిస్తాన్‌తో స్వదేశంలో చివరగా వన్డే సిరీస్‌లో పాల్గొన్నాడు కుల్దీప్‌.

మేనేజ్‌మెంట్‌ తీరుపై విమర్శలు
అయితే, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఈ చైనామన్‌ స్పిన్నర్‌కు ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌ పర్యటనకు ఎంపికైనా ఒక్క వన్డేలోనూ ఆడించకుండా.. కుల్దీప్‌ను బెంచ్‌కే పరిమితం చేసింది యాజమాన్యం. ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్‌మెంట్‌ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.

ముఖ్యంగా లార్డ్స్‌లో చివరిదైన, నిర్ణయాత్మక మూడో వన్డేలో కుల్దీప్‌ యాదవ్‌ను ఆడిస్తే ఫలితం వేరేలా ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తమ పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్ల సేవల్ని ఉపయోగించుకుని గెలుపొంది.. సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

ఒకే ఓవర్లో రెండు వికెట్లతో సత్తా
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడే అవకాశం పొందలేని కుల్దీప్‌ యాదవ్‌.. ఆ వెంటనే కౌంటీ ఫ్రాంఛైజీ యార్క్‌షైర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో రాయల్‌ వన్డే కప్‌-2026లో భాగంగా శుక్రవారం గ్లామోర్గాన్‌తో యార్క్‌షైర్‌ తరఫున కుల్దీప్‌ అరంగేట్రం చేశాడు.

ఈ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో రెండు వికెట్లతో సత్తా చాటాడు కుల్దీప్‌. మొత్తంగా పది ఓవర్ల కోటా పూర్తి చేసిన ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ మొదటి తొమ్మిది ఓవర్లలో ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. అయితే, తన ఆఖరి ఓవర్లో అలెక్స్‌ హోర్టాన్‌, జేమీ మెక్‌రాయ్‌ వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లలో 39 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

యార్క్‌షైర్‌ విజయం
ఇక యార్క్‌షైర్‌కు చెందిన మీడియం పేసర్‌ బెంజమిన్ క్లిఫ్‌ కేవలం 29 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఫలితంగా గ్లామోర్గాన్‌ 186 పరుగులకే పరిమితం కాగా.. లక్ష్య ఛేదనలో యార్క్‌షైర్‌ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మరోవైపు.. నార్తాంప్టన్‌ తరఫున కెంట్‌ జట్టుపై టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ కూడా రెండు వికెట్లు తీశాడు. అయితే, ఈ మ్యాచ్‌లో నార్తాంప్టన్‌ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

చదవండి: తెలివితక్కువోడు తప్పిస్తే.. తానేంటో నిరూపించుకున్నాడు!

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

IND Vs WI: హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)