రఫ్ఫాడించిన రింకూ

Published on Mon, 04/20/2026 - 04:05

ఐపీఎల్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న మాజీ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఎట్టకేలకు ఈ సీజన్‌లో గెలుపు రుచి చూసింది. ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో నైట్‌రైడర్స్‌ను విజయం వరించింది. గత నెల 28న లీగ్‌ ప్రారంభం కాగా... దాదాపు 20 రోజుల తర్వాత ఏడో మ్యాచ్‌లో కోల్‌కతా బోణీ కొట్టింది. మొదట స్పిన్నర్లు సత్తా చాటడంతో రాజస్తాన్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేసిన రహానే బృందం... స్వల్ప లక్ష్యఛేదనలోనూ తడబడ్డా కష్ట కాలంలో ‘ఫినిషర్‌’ రింకూ సింగ్‌ అజేయ అర్ధశతకంతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు.   

కోల్‌కతా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 19వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తొలి విజయం నమోదు చేసుకుంది. ఆదివారం ‘డబుల్‌ హెడర్‌’లో భాగంగా జరిగిన తొలి పోరులో కోల్‌కతా 4 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌పై గెలుపొందింది. స్పిన్నర్లు సత్తా చాటడంతో... ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన నైట్‌రైడర్స్‌ ఆ తర్వాత స్వల్ప స్కోరును ఛేదించేందుకు కూడా తీవ్రంగా ఇబ్బందిపడి చివరి ఓవర్‌లో గట్టెక్కింది. 

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌... నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్లు వైభవ్‌ సూర్యవంశీ (28 బంతుల్లో 46; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్‌ (29 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) తమకు అలవాటు అయిన శైలిలో దూకుడుగా ఆడగా... మిగిలిన వాళ్లు ఆకట్టుకోలేకపోయారు. కోల్‌కతా స్పిన్నర్లు కట్టిపడేయడంతో రాయల్స్‌ భారీ స్కోరు చేయలేకపోయింది. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ వరుణ్‌ చక్రవర్తి 4 ఓవర్లలో 14 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా... కార్తీక్‌ త్యాగి ఖాతాలో 3 వికెట్లు చేరాయి. నరైన్‌ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో కోల్‌కతా 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసింది. రింకూ సింగ్‌ (34 బంతుల్లో 53 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో జట్టును గెలిపించాడు. అనుకూల్‌ రాయ్‌ (16 బంతుల్లో 29; 1 ఫోర్, 2 సిక్స్‌లు) విలువైన పరుగులు చేశాడు. రాయల్స్‌ బౌలర్లలో జడేజా 3 ఓవర్లలో 8 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.  

చివరి 10 ఓవర్లలో 60/8 
రాయల్స్‌ ఇన్నింగ్స్‌ను రెండు భాగాలుగా చూడొచ్చు. ఓపెనర్లు దంచికొట్టడంతో ఆరంభంలో మెరుపు వేగంతో దూసుకెళ్లిన రాజస్తాన్‌... 10 ఓవర్లు ముగిసేసరికి 95/1తో నిలిచింది. ఆ తర్వాత కోల్‌కతా స్పిన్నర్లు పట్టు బిగించడంతో పరుగుల రాక గగనం కావడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి తదుపరి ఓవర్లలో 60 పరుగులు మాత్రమే చేసి 8 వికెట్లు కోల్పోయింది. ధ్రువ్‌ జురేల్‌ (5), పరాగ్‌ (12), హెట్‌మైర్‌ (15), డొనోవాన్‌ ఫెరీరా (7), జడేజా (9) పెవిలియన్‌కు వరుస కట్టారు. 

85/6 నుంచి... 
స్వల్ప లక్ష్యఛేదనలోనూ కోల్‌కతా తడబడింది. ఓపెనర్‌ సీఫెర్ట్‌ (0) ఇన్నింగ్స్‌ తొలి బంతికే క్లీన్‌ బౌల్డ్‌ కాగా... కెపె్టన్‌ అజింక్య రహానే (0) కూడా డకౌట్‌గా వెనుదిరిగాడు. అంగ్‌క్రిష్‌ రఘువంశీ (10) విఫలం కాగా... జురేల్‌ చేసిన మెరుపు స్టంపౌట్‌కు గ్రీన్‌ (13 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్‌) పెవిలియన్‌ బాటపట్టాడు. 

రావ్‌మన్‌ పావెల్‌ (20 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్‌), రమణ్‌దీప్‌ (10) ఎక్కువసేపు నిలవలేకపోయారు. దీంతో నైట్‌రైడర్స్‌ 85/6తో ఓటమి అంచుల్లో నిలిచింది. ఈ దశలో రింకూ సింగ్‌ చెలరేగిపోయాడు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ భారీ షాట్‌లతో లక్ష్యాన్ని కరిగించాడు. అతడికి అనుకూల్‌ నుంచి చక్కటి సహకారం దక్కింది. కోల్‌కతా విజయానికి 6 బంతుల్లో 9 పరుగులు అవసరం కాగా... బ్రిజేశ్‌ వేసిన చివరి ఓవర్‌లో రింకూ 4, 4, 6తో జట్టును గెలిపించాడు. 

రింకూ క్యాచ్‌ మిస్‌
రింకూ సింగ్‌ 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌలింగ్‌లో ఇచ్చిన సులువైన క్యాచ్‌ను బర్గర్‌ వదిలేశాడు. అప్పటికే ప్రధాన ఆటగాళ్లందరూ పెవిలియన్‌ చేరిపోయిన ఆ సమయంలో రింకూ వికెట్‌ కోల్పోయి ఉంటే... నైట్‌రైడర్స్‌ పరిస్థితి ఎలా ఉండేదో!

1 ఐపీఎల్‌లో అత్యధిక (12) సార్లు డకౌట్‌ అయిన ఓపెనర్‌గా రహానే చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. పార్థివ్‌ పటేల్‌ (11), శిఖర్‌ ధావన్‌ (10), గౌతమ్‌ గంభీర్‌ (10) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.  

స్కోరు వివరాలు 
రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) రహానే (బి) నరైన్‌ 39; వైభవ్‌ (సి) రమణ్‌దీప్‌ (బి) వరుణ్‌ 46; జురేల్‌ (స్టంప్డ్‌) సైఫెర్ట్‌ (బి) వరుణ్‌ 5; పరాగ్‌ (బి) వరుణ్‌ 12; హెట్‌మైర్‌ (సి) రఘువంశీ (బి) త్యాగి 15; డొనోవాన్‌ (సి అండ్‌ బి) నరైన్‌ 7; జడేజా (సి) గ్రీన్‌ (బి) త్యాగి 9; ఆర్చర్‌ (రనౌట్‌) 8; రవి బిష్ణోయ్‌ (సి) సీఫెర్ట్‌ (బి) త్యాగి 0; బ్రిజేశ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–81, 2–97, 3–99, 4–117, 5–124, 6–144, 7–146, 8–146, 9–155. బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 4–0–37–0; కార్తీక్‌ త్యాగి 4–0–22–3; గ్రీన్‌ 2–0–27–0; నరైన్‌4–0–26–2; వరుణ్‌ చక్రవర్తి 4–0–14–3; రమణ్‌దీప్‌ 2–0–26–0. 

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: సీఫెర్ట్‌ (బి) ఆర్చర్‌ 0; రహానే (సి) జురేల్‌ (బి) బర్గర్‌ 0; రఘువంశీ (ఎల్బీ) (బి) జడేజా 10; గ్రీన్‌ (స్టంప్డ్‌) జురేల్‌ (బి) రవి బిష్ణోయ్‌ 27; పావెల్‌ (సి) డొనోవాన్‌ (బి) జడేజా 23; రింకూ సింగ్‌ (నాటౌట్‌) 53; రమణ్‌దీప్‌ (బి) యశ్‌ రాజ్‌ 10; అనుకూల్‌ రాయ్‌ (నాటౌట్‌) 29; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–0, 2–5, 3–37, 4–52, 5–70, 6–85. బౌలింగ్‌: ఆర్చర్‌ 4–0–35–1; బర్గర్‌ 2–0–20–1; బిష్ణోయ్‌ 4–0–41–1; యశ్‌ రాజ్‌ 4–0–25–1; జడేజా 3–0–8–2; పరాగ్‌ 1–0–10–0; బ్రిజేశ్‌ 1.4–0–21–0.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)