Breaking News

RCB: ‘కొనుగోలు’కు సిద్ధమైన అనుష్క శర్మ, రణ్‌బీర్‌ కపూర్‌!

Published on Sat, 01/24/2026 - 16:03

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)కు ఉన్న క్రేజే వేరు. టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం, రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లి ఈ జట్టులో భాగం కావడం ఇందుకు ప్రధాన కారణం. అయితే, ప్రతి ఏడాది.. ‘‘ఈసారి కప్‌ మనదే’’ అనుకుంటూ సోషల్‌ మీడియాలో సందడి చేసే ఆర్సీబీ అభిమానులకు పదిహేడేళ్లపాటు చేదు అనుభవమే మిగిలింది.

పద్దెనిమిదేళ్లకు
ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ గతేడాది రజత్‌ పాటిదార్‌ (Rajat Patidar) కెప్టెన్సీలోని ఆర్సీబీ ఐపీఎల్‌ టైటిల్‌ నెగ్గింది. లీగ్‌ మొదలైన (2008) నాటి నుంచి జట్టుతోనే ఉన్న కోహ్లి.. పద్దెనిమిదేళ్లకు తర్వాత తొలిసారి ట్రోఫీని ముద్దాడి ఉద్వేగానికి లోనయ్యాడు.

చేతులు మారనున్న యాజమాన్యం
ఈ క్రమంలో విజయోత్సవాన్ని జరుపుకొనేందుకు సిద్ధమైన ఆర్సీబీ, ఫ్యాన్స్‌ విషాదంలో మునిగిపోవాల్సి వచ్చింది. తొక్కిసలాటలో అభిమానులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం నుంచి ఆర్సీబీ మ్యాచ్‌లు తరలిపోనున్నాయి. ఇందుకు తోడు ఆర్సీబీ యాజమాన్యం కూడా చేతులు మారనుంది.

ఆదార్‌ పూనావాలా ఆసక్తి
ఆర్సీబీని అమ్మకానికి పెట్టినట్లు ఫ్రాంఛైజీ మేనేజ్‌మెంట్‌ డియాజియో ఇటీవలే అధికారికంగా వెల్లడించింది. విపరీతమైన ఆదరణ కలిగి ఉన్న ఈ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ చీఫ్‌ ఆదార్‌ పూనావాలా ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వచ్చాయి.

‘కొనుగోలు’కు సిద్ధమైన అనుష్క శర్మ, రణ్‌బీర్‌ కపూర్‌!
తాజా సమాచారం ప్రకారం.. ఆర్సీబీలో వాటాలు కొనేందుకు బాలీవుడ్‌ ప్రముఖులు కూడా ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. విరాట్‌ కోహ్లి సతీమణి, బాలీవుడ్‌ స్టార్‌ అనుష్క శర్మ ఆర్సీబీలో మూడు శాతం వాటా కోసం సుమారు రూ. 400 కోట్లు వెచ్చించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌ తెలిపింది.

మరోవైపు.. రణ్‌బీర్‌ కపూర్‌ సైతం రెండు శాతం వాటా కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.  కాగా ఆర్సీబీ విలువ పెరగడంలో కోహ్లిది కీలక పాత్ర. అలాంటి ఫ్రాంఛైజీలోకి కోహ్లి జీవిత భాగస్వామి పెట్టుబడిదారుగా రావడాన్ని బీసీసీఐ ఆమోదిస్తుందో లేదో చూడాల్సి ఉంది. ద్వంద్వ ప్రయోజనాలు పొందకుండా ఉండేందుకు వీలుగా ఐపీఎల్‌ జట్లలో ఆటగాళ్లు (యాక్టివ్‌) ఎలాంటి వాటాలు కొనుగోలు చేయకుండా బీసీసీఐ ఆంక్షలు విధించింది. 

చదవండి: ఆస్ట్రేలియాతో టెస్టుకు భారత జట్టు ప్రకటన

Videos

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)