Breaking News

వినడానికి విచిత్రంగా ఉన్నా కోహ్లి కెరీర్‌లో ఇదే తొలిసారి..

Published on Sun, 02/19/2023 - 17:40

టీమిండియా రన్‌మెషిన్‌ విరాట్‌ కోహ్లి తన టెస్టు కెరీర్‌లో తొలిసారి స్టంప్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. వినడానికి విచిత్రంగా విన్నా ఇది నిజం. బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో కోహ్లి స్టంపౌటయ్యాడు. భారత రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ టాడ్‌ మర్ఫీ వేవాడు. ఆ ఓవర్‌ రెండో బంతిని కోహ్లి ఫ్రంట్‌ఫుట్‌ షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి మిస్‌ అయి కీపర్‌ అలెక్స్‌ కేరీ చేతుల్లో పడింది.

సెకన్‌ కూడా వేస్ట్‌ చేయని కేరీ విరాట్‌ బ్యాట్‌ను క్రీజులో పెట్టేలోపే బెయిల్స్‌ను ఎగరేశాడు. అప్పటికి కోహ్లి క్రీజుకు చాలా దూరంగా ఉండడం గమనార్హం. దీంతో కోహ్లి తొలిసారి తన టెస్టు కెరీర్‌లో స్టంపౌట్‌ అయ్యాడు. కోహ్లి కెరీర్‌ ఆరంభించి 15 ఏళ్లు కావొస్తుంది. ఈ 15 ఏళ్లలో కోహ్లి క్రీజు విడిచి ఫ్రంట్‌ఫుట్‌ ఆడిన సందర్భాలు చాలా తక్కువ.  ఇక వన్డేలు, టి20ల్లో తన ఆటను అందుకునే మొనగాడు లేడని ఇప్పటికే నిరూపించుకున్నాడు.

అయితే టెస్టుల్లో మాత్రం కోహ్లి ఆట కాస్త నిధానంగానే ఉంటుంది. మాములుగానే క్రీజులో నుంచి బయటికి రాని కోహ్లి టెస్టు‍ల్లో అసలు ఆ సాహసమే చేయడు. కానీ ఆసీస్‌తో టెస్టులో వేగంగా ఆడాలనే లేక ఇంకేదైనా కారణమో తెలియదు కానీ తొలిసారి స్టంప్‌ అవుట్‌ అయ్యి కోహ్లి అవసరం లేని రికార్డును కొనితెచ్చుకున్నాడు. ఇక మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసిన కోహ్లి.. రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి ఔట్‌ కాదని తేలినప్పటికి అంపైర్‌ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు.

చదవండి: KL Rahul: ఇక భరించలేం.. తొలగించాల్సిందే!


 

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)