Breaking News

చరిత్ర సృష్టించిన క్లాసెన్‌.. ఐపీఎల్‌ చరిత్రలోనే తొలిసారిగా ఇలా..

Published on Mon, 05/26/2025 - 11:18

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ (Heinrich Klaasen) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆద్యంతం ఆకాశమే హద్దుగా చెలరేగుతూ.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ పొట్టి క్రికెట్‌లోని అసలైన మజా అందించాడు.

కేవలం 37 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న క్లాసెన్‌.. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో వేగవంతమైన శతకం (Fastest Century) బాదిన మూడో క్రికెటర్‌గా యూసఫ్‌ పఠాన్‌ రికార్డును సమం చేశాడు. ఇక కేకేఆర్‌తో మ్యాచ్‌లో మొత్తంగా 39 బంతులు ఎదుర్కొన్న ఈ సౌతాఫ్రికా స్టార్‌ ఏడు ఫోర్లు, తొమ్మిది సిక్సర్ల సాయంతో 105 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఐపీఎల్‌ చరిత్రలోనే తొలిసారిగా ఇలా..
ఈ క్రమంలో క్లాసెన్‌ సరికొత్త రికార్డు సాధించాడు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక స్ట్రైక్‌రేటు (269.23)తో సెంచరీ బాదిన తొలి విదేశీ క్రికెటర్‌, ఓవరాల్‌గా రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో యూసఫ్‌ పఠాన్‌ అతడి కంటే ముందున్నాడు. ఇలా కేకేఆర్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌ సందర్భంగా క్లాసెన్‌ రెండు అరుదైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఓవరాల్‌గా క్లాసెన్‌కు ఐపీఎల్‌లో ఇది రెండో సెంచరీ.

110 పరుగుల తేడాతో జయభేరి 
అంతేకాదు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గానూ ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ నిలిచాడు. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే... ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరిగిన పోరులో సన్‌రైజర్స్‌ కేకేఆర్‌ను చిత్తు చేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన కమిన్స్‌ బృందం.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 278 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.

ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (16 బంతుల్లో 32), ట్రవిస్‌ హెడ్‌ (40 బంతుల్లో 76) శుభారంభం అందించగా.. క్లాసెన్‌ సునామీ ఇన్నింగ్స్‌తో స్కోరు బోర్డును పరుగులు తీయించాడు. మిగతా వాళ్లలో ఇషాన్‌ కిషన్‌ 29, అనికేత్‌ వర్మ 12(నాటౌట్‌) పరుగులు చేశారు.

ఇక లక్ష్య ఛేదనలో కేకేఆర్‌ 18.4 ఓవర్లలో కేవలం 168 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది. ఫలితంగా సన్‌రైజర్స్‌ 110 పరుగుల తేడాతో జయభేరి మోగించి.. ఈ సీజన్‌ను విజయంతో ముగించింది. రైజర్స్‌ బౌలర్లలో జయదేవ్‌ ఉనాద్కట్‌ (3/24), ఇషాన్‌ మలింగ (3/31), హర్ష్‌ దూబే (3/34) మూడేసి వికెట్లతో అద్భుతంగా రాణించారు.

హెన్రిచ్‌ క్లాసెన్‌ సాధించిన రికార్డులు
ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ వీరుల జాబితాలో చోటు
1. క్రిస్‌ గేల్‌- 30 బంతుల్లో శతకం
2. వైభవ్‌ సూర్యవంశీ- 35 బంతుల్లో శతకం
3. యూసఫ్‌ పఠాన్‌- 37 బంతుల్లో శతకం
4. హెన్రిచ్‌ క్లాసెన్‌- 37 బంతుల్లో శతకం
5. డేవిడ్‌ మిల్లర్‌- 38 బంతుల్లో శతకం

ఐపీఎల్‌లో అత్యధిక స్ట్రైక్‌రేటుతో వందకు పైగా పరుగులు సాధించింది వీరే
1. యూసఫ్‌ పఠాన్‌- రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున 2010లో ముంబై ఇండియన్స్‌పై 270.27 స్ట్రైక్‌రేటుతో 100 రన్స్‌
2. హెన్రిచ్‌ క్లాసెన్‌- సన్‌రైజర్స్‌ తరఫున 2025లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై 169.23 స్ట్రైక్‌రేటుతో 105 రన్స్‌ (నాటౌట్‌)
3. డేవిడ్‌ మిల్లర్‌- పంజాబ్‌ కింగ్స్‌ (కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌) తరఫున 2013లో ఆర్సీబీపై 265.78 స్ట్రైక్‌రేటుతో 101 రన్స్‌ (నాటౌ
ట్‌)
4. వైభవ్‌ సూర్యవంశీ- రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున గుజరాత్‌ టైటాన్స్‌పై 2025లో 265.78 స్ట్రైక్‌రేటుతో 101
5. క్రిస్‌ గేల్‌- ఆర్సీబీ తరఫున 2013లో పుణె వారియర్స్‌పై 265.14 స్ట్రైక్‌రేటుతో 175 రన్స్‌ (నాటౌట్‌).

చదవండి: Pat Cummins: ఫైనల్‌ చేరాల్సిన జట్టు.. మా వాళ్లను చూస్తే నాకే భయమేసింది

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)