Breaking News

ఓపెనర్‌గా కేఎల్‌ రాహుల్‌.. నాలుగో స్థానంలో ‘కొత్త’ ఆటగాడు!

Published on Wed, 05/14/2025 - 16:54

భారత టెస్టు జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు రాబోతున్నాయి. ఇన్నాళ్లుగా ఓపెనర్‌గా ఉన్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma)తో సంప్రదాయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మరోవైపు.. మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే దిగ్గజం విరాట్‌ కోహ్లి కూడా రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

ఈ నేపథ్యంలో వీరిద్దరి స్థానాలు భర్తీ చేసే ఆటగాళ్లు ఎవరన్న అంశంపై చర్చ జరగుతోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓపెనింగ్‌ జోడీగా కేఎల్‌ రాహుల్‌ (KL Rahul)- యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal)ను కొనసాగించాలని సూచించాడు.

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ సిరీస్‌లో
అయితే, నాలుగో స్థానానికి మాత్రం వసీం జాఫర్‌ కొత్త ఆటగాడిని ఎంపిక చేశాడు. కాగా గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా రోహిత్‌ శర్మ తొలి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేఎల్‌ రాహుల్‌ జైసూతో కలిసి భారత ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. రోహిత్‌ తిరిగి వచ్చిన తర్వాత కూడా వీరే ఓపెనర్లుగా కొనసాగారు.

ఈ నేపథ్యంలో వసీం జాఫర్‌ న్యూస్‌18తో మాట్లాడుతూ.. ‘‘బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో కేఎల్‌ రాహుల్‌- యశస్వి జైస్వాల్‌ ఓపెనర్లుగా రాణించారు. కాబట్టి కేఎల్‌ అదే స్థానంలో కొనసాగితే బాగుంటుంది. నిలదొక్కుకున్న జోడీని విడదీయడం వల్ల నష్టమే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

నాలుగో స్థానంలో గిల్‌!
ఇక శుభ్‌మన్‌ గిల్‌ విషయానికొస్తే.. అతడు వైట్‌ బాల్‌ క్రికెట్‌లో ఓపెనర్‌గా వస్తున్నాడు. కానీ టెస్టు క్రికెట్‌లో మాత్రం అతడిని మూడు నుంచి నాలుగో స్థానానికి పంపితే బాగుంటుంది.

మూడో స్థానంలో సాయి సుదర్శన్‌ను ఆడించాలి. సుదీర్ఘకాలం వన్‌డౌన్‌లో ఆడిస్తే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. కాగా కేఎల్‌ రాహుల్‌ టీమిండియా తరఫున ఓపెనర్‌గా 83 ఇన్నింగ్స్‌లో 2803 పరుగులు సాధించాడు. ఇందులో ఏడు శతకాలు ఉన్నాయి.

ఓపెనర్లుగా ఇలా
ఇక నాలుగో స్థానంలో రెండు ఇన్నింగ్స్‌ ఆడిన కేఎల్‌.. 108 పరుగులు చేయగలిగాడు. మరోవైపు.. శుబ్‌మన్‌ గిల్‌ 30 ఇన్నింగ్స్‌లో మూడో స్థానంలో వచ్చి 1019 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా 29 ఇన్నింగ్స్‌లో 874 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. ఇంత వరకు ఒక్కసారి కూడా నాలుగో స్థానంలో ఆడలేదు.

కాగా రోహిత్‌ శర్మ- విరాట్‌ కోహ్లిల నిష్క్రమణ తర్వాత టీమిండియా తొలిసారి ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 సైకిల్‌లో తొలి సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల్లో తలపడనుంది. ఈ టూర్‌ నుంచి భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. జూన్‌ 20 నుంచి ఈ సిరీస్‌ మొదలుకానుంది.

చదవండి: ‘మాక్స్‌వెల్‌ను పెళ్లి చేసుకోలేదు కాబట్టే ఇలా’!.. మండిపడ్డ ప్రీతి జింటా..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)