ఎంత పని చేశావు రాహుల్‌?!.. బుమ్రా రియాక్షన్‌ వైరల్‌

Published on Sat, 11/22/2025 - 11:10

సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా (IND vs SA 2nd Test)కు ఆరంభం నుంచే పెద్దగా కలిసి రావడం లేదు. గువాహటిలో టాస్‌ ఓడి తొలుత బౌలింగ్‌కు దిగిన భారత్‌ టీ విరామ సమయం వరకు కనీసం ఒక్క వికెట్‌ కూడా కూల్చలేకపోయింది. వికెట్లు తీసేందుకు భారత బౌలర్లు ఎంతగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది.

నిలకడగా ఆడిన ఓపెనర్లు
ప్రొటిస్‌ ఓపెనర్లు ఐడెన్‌ మార్క్రమ్‌ (Aiden Markram), ర్యాన్‌ రికెల్టన్‌ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ నిర్మించగా.. భారత బౌలర్లు ఈ జోడీని విడదీయలేక అవస్థలు పడ్డారు. నిజానికి సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్లోనే మార్క్రమ్‌ను వెనక్కి పంపే సువర్ణావకాశం టీమిండియాకు వచ్చింది. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఏడో ఓవర్‌ రెండో బంతిని గంటకు 142.5 కిలోమీటర్ల వేగంతో సంధించాడు.

క్యాచ్‌ జారవిడిచిన రాహుల్‌
ఈ గుడ్‌లెంగ్త్‌ డెలివరీని ఆడే క్రమంలో ముందుకు వచ్చిన మార్క్రమ్‌ బ్యాట్‌ అంచుకు తాకిన బంతి.. గాల్లోకి లేచింది. ఈ క్రమంలో సెకండ్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) తన ఎడమ పక్కకు జరిగిన మరీ క్యాచ్‌ పట్టే ప్రయత్నం చేశాడు. 

కానీ ఊహించని రీతిలో రాహుల్‌ క్యాచ్‌ జారవిడిచాడు. దీంతో తీవ్ర నిరాశకు గురైన బుమ్రా.. ముఖాన్ని చేతుల్లో దాచుకుంటూ తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

తొలి వికెట్‌ బుమ్రాకే
ఇక నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మార్క్రమ్‌.. ఆ తర్వాత నిలకడగా ఆడుతూ హాఫ్‌ సెంచరీ దిశగా పయనించాడు. అయితే, 27వ ఓవర్‌ ఐదో బంతికి బుమ్రా అద్భుత బంతితో మార్క్రమ్‌ను బౌల్డ్‌ చేశాడు. 

దీంతో 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మార్క్రమ్‌ నిష్క్రమించాడు. ఫలితంగా సౌతాఫ్రికా తొలి వికెట్‌ కోల్పోగా.. భారత్‌కు ఎట్టకేలకు బ్రేక్‌ లభించింది.  టీ విరామ సమయానికి సౌతాఫ్రికా 26.5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 82 పరుగులు చేసింది. మార్క్రమ్‌ (38).. ర్యాన్‌ రికెల్టన్‌తో కలిసి తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించాడు.  

కాగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ముప్పై పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. గువాహటిలోని బర్సపరా వేదికగా శనివారం మొదలైన రెండో టెస్టులో గెలిస్తేనే భారత్‌ 1-1తో సిరీస్‌ సమం చేసి పరువు నిలుపుకోగలుగుతుంది.

చదవండి: అందుకే సూపర్‌ ఓవర్లో వైభవ్‌ సూర్యవంశీని పంపలేదు: జితేశ్‌ శర్మ

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)