Breaking News

రూ.25 కోట్ల ఆట‌గాడు అట్ట‌ర్ ప్లాప్‌

Published on Fri, 12/19/2025 - 13:13

ఐపీఎల్ 2026 మినీ వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ యాషెస్ సిరీస్‌లో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. తొలి రెండు టెస్టుల్లో దారుణంగా విఫలమైన గ్రీన్‌.. ఇప్పుడు అడిలైడ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో అదే తీరును కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌటైన గ్రీన్‌.. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. జోష్ టంగ్ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. బౌలింగ్‌లోనూ కేవలం ఒక్క వికెట్ పడగొట్టాడు.

కేకేఆర్‌కు హెడ్‌ఎక్‌..
ఇటీవల దుబాయ్‌లో జరిగిన మినీ వేలంలో గ్రీన్‌ను రూ. 25.20 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్  కొనుగోలు చేసింది. గ్రీన్‌ను ఒక కంప్లీట్ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి తీసుకున్న కేకేఆర్.. అతడిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణిస్తాడని నైట్‌రైడర్స్ ఆశిస్తోంది. కానీ రెడ్ బాల్ క్రికెట్‌లో అతడి ప్రస్తుత ఫామ్ కోల్‌కతా మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. ముఖ్యంగా ఒత్తిడి సమయాల్లో ఆడలేక వికెట్ పారేసుకోవడం చర్చనీయంగా మారింది.

భారీ ఆధిక్యం దిశగా ఆసీస్‌..
అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ జోరు కొనసాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. కంగారూ జట్టు ప్రస్తుతం 356 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ అడిలైడ్ టెస్టులో ట్రావిస్ హెడ్ సెంచరీతో సత్తాచాటాడు. 142 పరుగులతో హెడ్ నాటౌట్‌గా ఉన్నాడు. అతడితో పాటు అలెక్స్ కారీ(52) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది.
చదవండి: IPL 2026: 'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము'

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు