టీమిండియాతో సిరీస్‌.. బంగ్లా క్రికెట్‌లో కీల‌క ప‌రిణామం

Published on Thu, 09/12/2024 - 09:07

టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్ క్రికెట్‌లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) డైరెక్టర్ పదవికి మాజీ కెప్టెన్ ఖలీద్ మహమూద్ రాజీనామా చేశాడు.  దేశంలో రాజకీయ మార్పుల కారణంగా అత‌డు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఇప్ప‌టికే బంగ్లాలో కొత్త ప్ర‌భుత్వం ఏర్పడిన వెంట‌నే బీసీబీ ప్రెసిడెంట్ ప‌ద‌వి నుంచి నజ్ముల్ హసన్ సైతం వైదొలిగాడు. అత‌డి స్ధానంలో మాజీ క్రికెటర్‌ ఫరూఖ్‌ అహ్మద్ బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. ఇప్పుడు ఖలీద్ వంతు వ‌చ్చింది. 

కాగా 2013లో గాజీ అష్రఫ్ హుస్సేన్‌ను ఓడించి తొలిసారిగా డైరెక్టర్‌గా ఎన్నికైన మహమూద్.. వరుసగా మూడు పర్యాయాలు ఆ ప‌ద‌విలో కొన‌సాగారు. తన ప‌ద‌వీకాలంలో బంగ్లా క్రికెట్ అభివృద్దికి మహమూద్ ఎంతగానో కృషి చేశాడు. చాలా ఏళ్ల పాటు బీసీబీ గేమ్ డెవలప్‌మెంట్ కమిటీకి ఛైర్మన్‌గా పనిచేశాడు. 

యువ క్రికెటర్లను తయారు చేయడంలో అతడిది కీలక పాత్ర. ఖలీద్ హయాంలోనే యువ బంగ్లా జట్టు 2020లో భారత్‌ను ఓడించి అండర్‌19 ప్రపంచ కప్‌ గెలుచుకుంది. కాగా నజ్ముల్ హసన్, ఖలీద్ బాటలోనే మరికొందరు ప్రయాణించనున్నట్లు తెలుస్తోంది. 

బోర్డు డైరెక్టర్లు షఫియుల్ ఆలం చౌదరి, నైమూర్ రెహమాన్ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక భారత్‌-బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
చదవండి: AUS vs ENG: హెడ్ విధ్వంసం.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్‌
 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)