తొలి వ‌న్డేలో రిటైర్డ్ హ‌ర్ట్‌.. గిల్ గాయంపై కీల‌క అప్‌డేట్‌

Published on Wed, 07/15/2026 - 09:58

ఇంగ్లండ్ ఎడ్జ్‌బాస్టన్ వేదిక‌గా జరిగిన తొలి వ‌న్డేలో కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ 80 ప‌రుగుల వ‌ద్ద రిటైర్డ్ హ‌ర్ట్‌గా వెనుదిరిగిన సంగ‌తి తెలిసిందే. సెంచ‌రీ దిశగా సాగుతున్న గిల్‌కు కుడి కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో అసౌక‌ర్యంగా ఫీల‌య్యాడు.  వెంటనే భారత జట్టు ఫిజియో మైదానంలోకి వచ్చి చికిత్స అందించిన‌ప్ప‌టికీ నొప్పి త‌గ్గ‌క‌పోవ‌డంతో గిల్ రిటైర్డ్ హ‌ర్ట్ అయ్యి పెవిలియ‌న్ చేరాడు. ఈ స‌మ‌యంలో అత‌డు న‌డుస్తున్నంత సేపు నొప్పితో ఇబ్బంది ప‌డిన‌ట్లుగా క‌నిపించింది. 

నొప్పితో బాధ‌ప‌డుతున్న గిల్ రెండో వ‌న్డే ఆడుతాడా లేదా అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. తాజాగా గిల్ గాయానికి సంబంధించి కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. గాయం తీవ్ర‌తపై అధికారిక ప్ర‌క‌ట‌న రాక‌పోయిన‌ప్ప‌టికీ కేవ‌లం కండ‌రాలు ప‌ట్టేయ‌డంతోనే నొప్పి వ‌చ్చిన‌ట్లు భార‌త మెడిక‌ల్ బృందం ప్ర‌క‌టన విడుద‌ల చేసింది. 

ఇప్ప‌టికైతే గిల్ బాగానే ఉన్నాడ‌ని, రెండో వ‌న్డేలో ఆడుతాడ‌ని టీమిండియా మేనేజ్‌మెంట్ తెలిపింది. రెండో వ‌న్డేకు ఒక‌రోజు గ్యాప్ ఉండ‌డంతో పూర్తిగా విశ్రాంతి తీసుకుంటే స‌రిపోతుంద‌ని పేర్కొంది. గిల్‌ కూడా తన గాయంపై స్పందించాడు. ‘నేను బాగానే ఉన్నాను. కండరాల నొప్పితో కాస్త బాధపడ్డాను. ఒకరోజు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. రెండో వన్డేకు నేను ఫిట్‌గానే ఉంటాను’ అని చెప్పుకొచ్చాడు. 

ఇక మ్యాచ్‌లో కోహ్లి, రోహిత్‌లు వెనువెంట‌నే ఔటైన త‌ర్వాత గిల్‌, అయ్య‌ర్‌తో క‌లిసి బాధ్య‌త‌గా ఆడాడు. ఇద్ద‌రు క‌లిసి మూడో వికెట్‌కు 101 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. అయితే గిల్ రిటైర్డ్ హర్ట్ వెళ్లిన కొద్దిసేపటికే శ్రేయస్ అయ్యర్ 35 పరుగుల వద్ద రనౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ కూడా కేవలం ఒక్క పరుగుకే ఔటవడంతో భారత్‌పై మరోసారి ఒత్తిడి పెరిగింది. ఆ సమయంలో క్రీజ్ లోకి వచ్చిన ఆల్ రౌండర్స్ వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ లు బాధ్యతాయుతంగా ఆడుతూ ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేసి ఇంగ్లాండ్ ను మ‌ట్టిక‌రిపించారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఒక దశలో 107/6తో కష్టాల్లో పడింది. అయితే జో రూట్, లియామ్ డాసన్ అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకుని 258 పరుగుల గౌరవప్రదమైన స్కోరు అందించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ నాలుగు వికెట్లతో రాణించి ఇంగ్లండ్‌ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. తొలి వన్డేలో గెలిచి మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో టీమిండియా ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే గురువారం కార్డిఫ్‌ వేదికగా జరగనుంది.

చదవండి: ఇంగ్లండ్ కంచుకోట బద్దలు.. గిల్‌ అరుదైన ఫీట్‌

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)