IND vs SL: టెస్టు సిరీస్‌ నుంచి కీలక ప్లేయర్‌ అవుట్‌!

Published on Fri, 07/03/2026 - 11:18

టీమిండియాతో టెస్టు సిరీస్‌ నేపథ్యంలో శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌ బ్యాటర్‌ పాతుమ్‌ నిసాంక ఈ సిరీస్‌కు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. కాగా టీమిండియా వచ్చే నెల (ఆగష్టు)లో శ్రీలంకలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. 

ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో భారత్‌ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడనుంది. గాలే వేదికగా ఆగస్టు 15 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుండగా... 23 నుంచి కొలంబోలో రెండో మ్యాచ్‌ జరుగుతుంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం శ్రీలంక వెస్టిండీస్‌ పర్యటనలో ఉంది. తొలి టెస్టులో ఆతిథ్య జట్టు చేతిలో 217 పరుగులతో ఓటమిపాలైన లంక.. ఎలాగైనా తిరిగి పుంజుకోవాలని పట్టుదలగా ఉంది. రెండో టెస్టులో గెలిచి సిరీస్‌ 1-1తో సమం చేయాలని ఉవ్విళ్లూరుతోంది.

లంక ప్రీమియర్‌ లీగ్‌ నుంచి అవుట్‌
అయితే, ఓపెనర్‌ పాతుమ్‌ నిసాంక మణికట్టు గాయంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. శస్త్ర చికిత్స కోసం అతడు యూకేకు వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జూలై 17 నుంచి మొదలుకానున్న లంక ప్రీమియర్‌ లీగ్‌-2026 నుంచి నిసాంక వైదొలిగాడు. ఈ లీగ్‌ తర్వాత వారం రోజుల వ్యవధిలోనే భారత్‌- శ్రీలంక టెస్టు సిరీస్‌ మొదలుకానుంది.

నిలకడగా ఆడుతూ..
కాబట్టి పాతుమ్‌ నిసాంక టీమిండియాతో సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. గతేడాది కాలంగా నిసాంక టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. 2025లో అతడు సగటు 56తో 393 పరుగులు రాబట్టాడు.

ఇప్పటికి మొత్తంగా 33 ఇన్నింగ్స్‌లో కలిపి 1310 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఏడు అర్ధ శతకాలు ఉన్నాయి. సొంతగడ్డపై ఆడిన 18 ఇన్నింగ్స్‌లో అతడు రెండు శతకాల సాయంతో 725 పరుగులు చేయడం విశేషం. 

ఇలా నిలకడగా ఆడుతూ జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్న నిసాంక.. టీమిండియాతో సిరీస్‌కు దూరం కావడం ఆ జట్టుకు కోలుకోలేని దెబ్బలాంటిదే. కాగా విండీస్‌తో తొలి టెస్టులో గాయం కారణంగా ఇబ్బంది పడిన నిసాంక రెండు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం ఐదు పరుగులే చేసి నిష్క్రమించాడు.

చివరిసారి వైట్‌వాష్‌
ఇదిలా ఉంటే..టీమిండియా చివరిసారి 2017లో శ్రీలంకలో టెస్టు సిరీస్‌ ఆడింది. అప్పుడు మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 3–0తో వైట్‌వాష్‌ చేసింది. ఇక 2008 నుంచి లంక గడ్డపై టెస్టు సిరీస్‌ ఓడని టీమిండియా... అదే ఆధిపత్యం కొనసాగిస్తుందా చూడాలి.

కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) 2025–27లో భాగంగా ఇప్పటి వరకు 9 టెస్టులు ఆడిన శుబ్‌మన్‌ గిల్‌ సేన... 4 విజయాలు, 4 పరాజయాలు, ఒక ‘డ్రా’తో ప్రస్తుతం పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. 

చదవండి: చరిత్ర సృష్టించిన రొనాల్డో!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)