Breaking News

మెల్‌బోర్న్‌లో దిగ్విజయంగా ముగిసిన కేసిఆర్ కప్

Published on Tue, 09/19/2023 - 10:57

బీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో మెల్‌బోర్న్‌లో మూడు వారాల పాటు జరిగిన కేసీఆర్‌ క్రికెట్‌ కప్‌ టోర్నమెంట్‌ ఆదివారం(సెప్టెంబర్‌17)తో దిగ్విజయంగా ముగిసింది. జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని మెల్బోర్న్ లోని అల్కాక్ రిజర్వ్ లోని పెవిలియన్ లో ఈ టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌ను నిర్వహించారు.

ఈ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు పెద్ద ఎత్తున ఎన్నారైలు హాజరయ్యారు. ఈ సందర్భంగా  బీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ.. "ఆస్ట్రేలియాలో స్థిరపడిన 29 రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలతో మూడు వారాల పాటు ఈ టోర్నీ ఘనంగా జరిగింది. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ కు మార్పు గల ముఖ్య ఉద్దేశాన్ని అందరికీ తెలియజేయాలని ఈ టోర్నమెంట్‌ను నిర్వహించామని" ఆయన తెలిపారు.

అదే విధంగా  తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమం పై  విక్టోరియా స్టేట్ కన్వీనర్ ఉప్పు  సాయిరాం  చేసిన పవర్ ప్రెజెంటేషన్ పలువురిని ఆకట్టుకుంది. మరోవైపు కేసీఆర్‌ క్రికెట్‌ కప్‌ టోర్నీని విజయవంతంగా ముగించిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందాన్ని పలువురు ప్రశంసించారు.

ముగింపు వేడుకల్లో బీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా ముఖ్య నాయకులు సాయిరాం ఉప్పు, వినయ్ సన్నీ గౌడ్,సాయికృష్ణ కల్వకుంట్ల, ప్రవీణ్ లేదెళ్ల ,వంగపల్లి సురేందర్ రెడ్డి, విశ్వామిత్ర మంత్రి ప్రగడ , సూర్య రావు , అశోక్ ,రాకేష్ , అమిత్ , వినోద్ కత్తుల ,విజయ్ నడదూర్ , సతీష్ ,శివ హైదరాబాద్ , హరి పల్ల, కరుణాకర్ నందవరం ,వివిధ సంఘాల నాయకులు, ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.
చదవండి: IND vs AUS: ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా.. షెడ్యూల్‌, ఆరంభ సమయం, జట్లు.. పూర్తి వివరాలివే

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?