Breaking News

800 మీటర్లలో  సప్త స్వర్ణం 

Published on Sun, 08/03/2025 - 06:27

సింగపూర్‌: ఒకటి కాదు...రెండు కాదు... మూడు కాదు... నాలుగు కాదు... వరుసగా ఏడోసారి కేటీ లెడెకీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. లాంగ్‌ డిస్టెన్స్‌ స్విమ్మింగ్‌లో తనకు తిరుగులేదని అమెరికా మహిళా స్టార్‌ స్విమ్మర్‌ నిరూపించుకుంది. ప్రపంచ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌ 800 మీటర్ల ఫ్రీస్టయిల్‌ విభాగంలో 7వసారి లెడెకీ చాంపియన్‌గా నిలిచింది. 28 ఏళ్ల లెడెకీ 800 మీటర్ల విభాగంలో 7వసారి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 

శనివారం హోరాహోరీగా సాగిన 800 మీటర్ల ఫైనల్‌ రేసును లెడెకీ 8 నిమిషాల 05.62 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ చాంపియన్‌షిప్‌లో నాలుగో స్వర్ణంపై గురి పెట్టిన సమ్మర్‌ మెకింటోష్‌ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. మెకింటోష్‌ 8 నిమిషాల 07.29 సెకన్లలో రేసును ముగించి మూడో స్థానంలో నిలిచింది. లానీ పాలిస్టర్‌ (ఆస్ట్రేలియా; 8 నిమిషాల 05.98 సెకన్లు) రజత పతకాన్ని కైవసం చేసుకుంది.

 700 మీటర్లు ముగిశాక మెకింటోష్‌ 0.14 సెకన్ల ఆధిక్యంలో ఉండగా... చివరి 100 మీటర్లలో లెడెకీ జోరు పెంచడంతో చివరకు మెకింటోష్‌ మూడో స్థానంతో, లానీ పాలిస్టర్‌ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచి్చంది. 

16 ఏళ్ల ప్రాయంలో 2013 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 800 మీటర్ల ఫ్రీస్టయిల్‌ విభాగంలో తొలిసారి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్న లెడెకీ... 2015లో, 2017లో, 2019లో, 2022లో, 2023లోనే బంగారు పతకాలు సొంతం చేసుకోవడం విశేషం. ఇప్పటి వరకు ప్రపంచ చాంపియన్‌షిప్‌ చరిత్రలో లెడెకీ 23 స్వర్ణాలు, 6 రజతాలు, 1 కాంస్యం సాధించింది. ఒలింపిక్స్‌లో 9 స్వర్ణాలు, 4 రజతాలు, 1 కాంస్యం కైవసం చేసుకుంది. ఓవరాల్‌గా లెడెకీ 44 ప్రపంచ, ఒలింపిక్‌ పతకాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.

మిక్స్‌డ్‌ రిలేలో ప్రపంచ రికార్డు
మరోవైపు మిక్స్‌డ్‌ ఫ్రీస్టయిల్‌ 4్ఠ100 రిలేలో జాక్‌ అలెక్సీ, ప్యాట్రిక్‌ సామన్, కేట్‌ డగ్లస్, టోరి హుస్కీలతో కూడిన అమెరికా జట్టు కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు పసిడి పతకాన్ని హస్తగతం చేసుకుంది. అమెరికా బృందం 3 నిమిషాల 18.48 సెకన్లలో రేసును ముగించి 2023లో 3 నిమిషాల 18.83 సెకన్లతో ఆ్రస్టేలియా బృందం నెలకొలి్పన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. 

మహిళల 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ విభాగంలో గ్రెట్‌చెన్‌ వాల్‌‡్ష (అమెరికా; 24.83 సెకన్లు) బంగారు పతకాన్ని దక్కించుకుంది. పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో పారిస్‌ ఒలింపిక్స్‌ చాంపియన్‌ కామెరాన్‌ మెక్‌ఇవోయ్‌ (ఆ్రస్టేలియా; 21.14 సెకన్లు) స్వర్ణ పతకాన్ని సాధించాడు. 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ కేలీ మెక్‌కియోవన్‌ (ఆ్రస్టేలియా; 2ని:03.33 సెకన్లు) విజేతగా నిలిచి టైటిల్‌ నిలబెట్టుకున్నాడు. నేటితో ముగియనున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ప్రస్తుతం అమెరికా 8 స్వర్ణాలు, 11 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 26 పతకాలతో నంబర్‌వన్‌ స్థానంలో ఉంది.

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)