Breaking News

టీమిండియావైపు దూసుకొస్తున్న కర్ణాటక యువ సంచలనం

Published on Wed, 02/18/2026 - 18:41

భారత దేశవాలీ క్రికెట్‌లో ప్రస్తుతం స్మరణ్‌ రవిచంద్రన్‌ అనే పేరు మార్మోగిపోతుంది. 22 ఏళ్ల ఈ కర్ణాటక యువ బ్యాటర్‌ ఫార్మాట్లకతీతంగా వరుస సెంచరీలు, డబుల్‌ సెంచరీలతో చెలరేగిపోతూ భారత క్రికెట్‌లో పెను సంచలనంగా మారాడు. ఎడమ చేతి వాటం అటాకింగ్‌ మిడిల్డార్‌ బ్యాటర్‌ అయిన స్మరణ్‌.. ప్రస్తుత రంజీ సీజన్‌లో ఆకాశమే హద్దుగా విజృంభిస్తున్నాడు.

13 ఇన్నింగ్స్‌ల్లో 2 డబుల్‌ సెంచరీలు, 2 సెంచరీలు, 3 అర్ద సెంచరీల సాయంతో 950 పరుగులు (95 సగటున) చేసిన స్మరణ్‌.. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో ఢిల్లీ బ్యాటర్‌ ఆయుశ్‌ దొసేజాను (949 పరుగులు) అధిగమించాడు. స్మరణ్‌ భీకర ఫామ్‌ చూసి సహచర క్రికెటర్లు అవాక్కవుతున్నారు. విశ్లేషకులు సైతం అబ్బురపడుతున్నారు.

ట్విన్‌ సెంచరీస్‌
ప్రస్తుతం ఉత్తరాండ్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో స్మరణ్‌ ఉగ్రరూపం దాల్చాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు (135, 127) చేసి భీకర ఫామ్‌ను కొనసాగించాడు. స్మరణ్‌ సహా దేవదత్‌ పడిక్కల్‌ (232), కేఎల్‌ రాహుల్‌ (141, 70 నాటౌట్‌) శివాలెత్తడంతో ఈ మ్యాచ్‌లో కర్ణాటక బంపర్‌ విక్టరీ దిశగా సాగుతోంది.  

మొత్తం 3 డబుల్‌ సెంచరీలు, 3 సెంచరీలు
తాజా ప్రదర్శనతో స్మరణ్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 1500 పరుగుల మైలురాయిని దాటాడు. 25 ఇన్నింగ్స్‌ల స్వల్ప కెరీర్‌లో 3 డబుల్‌ సెంచరీలు, 3 సెంచరీలు, 4 హాఫ్‌ సెంచరీల సాయంతో 1500 పరుగుల మార్కును క్రాస్‌ చేశాడు. అతని కెరీర్‌ సగటు 72కు పైగా ఉండటం విశేషం.

లిస్ట్‌-ఏ క్రికెట్‌లోనూ తిరుగలేని మొనగాడే..!
స్మరణ్‌ సెంచరీల మోత, పరుగుల ప్రవాహం ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌కు మాత్రమే పరిమితం​ కాలేదు. ఈ మైసూరు కుర్రాడు లిస్ట్‌-ఏ క్రికెట్‌లోనూ అదరగొడుతున్నాడు. ఇటీవల (2024-25) కర్ణాటక విజయ్‌ హజారే వన్డే ట్రోఫీ సాధించడంలో స్మరణ్‌ అత్యంత కీలకపాత్ర పోషించాడు. 

సెమీఫైనల్లో మ్యాచ్‌ విన్నింగ్‌ హాఫ్‌ సెంచరీతో (76) పాటు, ఫైనల్లో మెరుపు సెంచరీ (101) చేసి తన జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. లిస్ట్‌-ఏ ఫార్మాట్‌లో మొత్తం 14 ఇన్నింగ్స్‌లు ఆడిన స్మరణ్‌ 96.48 స్ట్రయిక్‌రేట్‌తో 50కి పైగా సగటున 2 సెంచరీలు, 3 హాఫ్‌ సెంచరీల సాయంతో 604 పరుగులు చేశాడు.

పొట్టి ఫార్మాట్‌లోనూ పర్వాలేదు
ఫస్ట్‌క్లాస్‌, లిస్ట్‌-ఏ ఫార్మాట్లతో పోలిస్తే స్మరణ్‌ టీ20 ఫార్మాట్‌ రికార్డు ఓ మోస్తరుగా ఉంది. పొట్టి ఫార్మాట్‌లో స్మరణ్‌ 13 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌ చేసి 162.45 స్ట్రయిక్‌రేట్‌తో 3 అర్ద సెంచరీల సాయంతో 489 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.

బౌలింగ్‌లోనూ మెరిపిస్తాడు
స్మరణ్‌ విధ్వంసకర బ్యాటింగ్‌తో మాత్రమే కాకుండా బౌలింగ్‌లోనూ మెరిపించగల సమర్దుడు. కుడి చేతి ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌ చేసే స్మరణ్‌ కీలక సమయాల్లో బంతితోనూ మ్యాజిక్‌ చేయగలడు. లోకల్‌ క్రికెట్‌లో అతను బౌలింగ్‌లోనూ ప్రూవ్‌ చేసుకున్నాడు.

అనుకోకుండా వచ్చిన ఐపీఎల్‌ అవకాశం
స్మరణ్‌కు ఐపీఎల్‌ 2025లో ఊహించని విధంగా అవకాశం వచ్చింది. ఆసీస్‌ స్టార్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా గాయపడంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్మరణ్‌కు అక్కున చేర్చుకుంది (30 లక్షలు). అయితే స్మరణ్‌కు ఆ సీజన్‌లో అవకాశాలు దక్కలేదు. 

స్మరణ్‌పై భారీ అంచనాలు ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌ అతన్ని 2026 సీజన్‌కు కూడా రీటైన్‌ చేసుకుంది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో స్మరణ్‌కు అవకాశం దొరికి ఇదే తరహాలో చెలరేగితే, త్వరలోనే టీమిండియా తలుపులు తట్టడం ఖాయమని క్రికెట్‌ పండితులు అంచనా వేస్తున్నారు.  
 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)