Breaking News

‘బాధ ఎందుకు? అతడి వీడ్కోలు వేడుకలా జ‌రపాల్సిందే!’

Published on Sat, 07/18/2026 - 17:47

ఇంగ్లండ్‌తో ఆదివారం జ‌ర‌గ‌నున్న వ‌న్డే మ్యాచ్ రోహిత్ శ‌ర్మ‌కు ఆఖ‌రిద‌ని, ఆ త‌ర్వాత అత‌డు రిటైర్మెంట్ ఇవ్వ‌నున్న‌ట్లు ఊహాగానాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బీసీసీఐ సెక్ర‌ట‌రీ దేవ‌జిత్ సైకియా రోహిత్ రిటైర్మెంట్ వార్త‌ల‌పై స్పందించారు. అవ‌న్నీ త‌ప్పుడు వార్త‌ల‌ని, జ‌ట్టులో కొన‌సాగినంత‌కాలం రోహిత్ శ‌ర్మ టీమిండియాకు ఆడుతాడ‌ని, అత‌డి రిటైర్మెంట్ ఇప్పుడే ఉండ‌ద‌ని పేర్కొంటూ ఊహాగానాల‌కు తెర‌దించాడు.  

అయితే రోహిత్ శ‌ర్మ రిటైర్మెంట్‌ వార్తలపై భార‌త దిగ్గ‌జం క‌పిల్ దేవ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. రోహిత్ ఎప్పుడు ఆట‌కు వీడ్కోలు పలికినా అత‌డి రిటైర్మెంట్‌ను ఒక వేడుక‌లా సెల‌బ్రేట్ చేయాల‌ని బీసీసీఐకి సూచించారు. 19 ఏళ్ల కెరీర్‌లో కెప్టెన్‌గా, ప్లేయ‌ర్‌గా ఎన్నో అరుదైన మైలురాళ్ల‌ను అందుకున్న రోహిత్ శ‌ర్మకు గౌర‌వంగా వీడ్కోలు ప‌ల‌కాల్సిన అవ‌స‌ర‌ముందన్నారు. 

రిటైర్మెంట్ అనేది క్రికెట‌ర్ల‌కు కామ‌న్ అని, దాని గురించి బాధ‌ప‌డొద్ద‌ని,  ఆ ప్ర‌క్రియ‌ను ఒక వేడుక‌లా జ‌రుపుకోవాల‌ని క‌పిల్ హిత‌వు పలికారు. పీటీఐకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో క‌పిల్ దేవ్ మాట్లాడుతూ.. ‘రిటైర్మెంట్ అనే ప‌దం విన‌గానే ఎందుకు బాధ‌ప‌డాలి. స‌మ‌యం వ‌చ్చింది కాబ‌ట్టే అంతా రోహిత్ వీడ్కోలు గురించి మాట్లాడుకుంటున్నారు. 19 ఏళ్లుగా రోహిత్ త‌న ఆట‌తో ఎంతో సంతోషాన్ని పంచాడు. ఏదోఒక రోజు అంద‌రూ రిటైర్ అవ్వాల్సిందే. 

నాతో పాటు సునీల్ గావ‌స్క‌ర్‌, స‌చిన్ టెండూల్క‌ర్‌, రాహుల్ ద్ర‌విడ్ ఇలా అంద‌రం ఆట‌కు వీడ్కోలు ప‌లికిన‌వాళ్ల‌మే. ఒక‌వేళ రోహిత్ రిటైర్మెంట్‌కు స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు మ‌న‌మంతా దానిని ఒక వేడుక‌గా జ‌రుపుకోవాలి. రోహిత్ వీడ్కోలు ఎప్పుడు ప‌లికినా ఆ మ్యాచ్‌లో మాత్రం సెంచ‌రీ సాధించాల‌ని బ‌లంగా కోరుకుంటున్నా.’ అని క‌పిల్ దేవ్ తెలిపారు.

ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌లో రోహిత్ ఆడిన రెండు వ‌న్డేలు క‌లిపి కేవ‌లం 37 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. అంత‌క‌ముందు అఫ్గానిస్తాన్‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో రోహిత్ వ‌రుస‌గా 16, 48, 79 ప‌రుగులు చేశాడు. తాజాగా ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో వ‌రుస వైఫ‌ల్యాలతో రోహిత్ రిటైర్మెంట్ వార్త‌లు తెర‌మీదకు వ‌చ్చాయి.

 

Read: వ‌రుస ఓట‌ములు.. విండీస్ జ‌ట్టులో భారీ మార్పులు!

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)