Breaking News

అందరివాడు కేన్‌ మామా...

Published on Sat, 06/13/2026 - 03:35

జెంటిల్‌మన్‌ క్రికెటర్‌ అంటే ఎలా ఉండాలి... పరాజయంలో, మైదానంలో కఠిన సమయంలో, తుది ఫలితంతో గుండె బద్దలైన క్షణంలో కూడా ప్రశాంతంగా కనిపించడమే కాదు... నిగ్రహం కోల్పోకుండా తన ‘క్లాస్‌’ను కోల్పోకుండా వ్యవహరించాలి. వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్, టి20 వరల్డ్‌ కప్‌ ఫైనల్, ఐపీఎల్‌ ఫైనల్‌... ఇలా తన సారథ్యంలో మూడుసార్లూ చివరి మెట్టుపై ఓటమి ఎదురైనప్పుడు కూడా అతను ఎక్కడా గీత దాటలేదు... 2019 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్లో దాదాపు తమ చేతుల్లోంచి లాక్కున్నట్లుగా ట్రోఫీని కోల్పోయిన సమయంలోనూ అతను ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అదే చిరునవ్వు, అదే సంయమనం. అందుకే అతను అందరివాడు అయ్యాడు.

ప్రత్యర్థి జట్ల అభిమానులు కూడా పలుమార్లు అతను విజయంలో భాగం అయి ఉంటే బాగుండేదని కోరుకున్నారు. అలాంటి మంచి పేరును సంపాదించుకున్న ఆటగాడే కేన్‌ విలియమ్సన్‌. హైదరాబాద్‌ ఫ్యాన్స్‌ అంతా ‘కేన్‌ మామా’ అంటూ అభిమానంతో పిలుచుకునే ఈ న్యూజిలాండ్‌ దిగ్గజం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 2010 తర్వాత గత దశాబ్దన్నర కాలంలో తమదైన ముద్ర వేసిన ‘ఫ్యాబ్‌ 4’లలో ఒకడైన కేన్‌ ఇప్పుడు పూర్తిగా తప్పుకున్నాడు.   -సాక్షి క్రీడా విభాగం 

న్యూజిలాండ్‌ క్రికెట్‌ స్థాయిని పెంచి, తమదైన ఆటతో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో మార్టిన్‌ క్రో, రిచర్ట్‌ హ్యాడ్లీ, స్టీఫెన్‌ ఫ్లెమింగ్, బ్రెండన్‌ మెకల్లమ్‌ల తర్వాత కేన్‌ విలియమ్సన్‌ పేరు కచ్చితంగా ఉంటుంది. 20 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసి తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన కేన్‌ ఆ తర్వాత దూసుకుపోయి పదిహేనేళ్ల పాటు నిలకడైన ప్రదర్శనతో తానేంటో నిరూపించుకున్నాడు. 

అటు పేస్, ఇటు స్పిన్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఆడగల నైపుణ్యం కేన్‌ను సాంప్రదాయ టెస్టు క్రికెట్‌లో ఈతరం అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా నిలిపింది. ‘ఫ్యాబ్యులస్‌ 4’లలో ఒకడిగా స్టీవ్‌ స్మిత్, జో రూట్, విరాట్‌ కోహ్లిలతో పోటీ పడుతూ పరుగులు సాధించిన విలియమ్సన్‌ పలు ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు. తనదైన ‘క్లాసిక్‌’ శైలితో వన్డే క్రికెట్‌లో చక్కటి గణాంకాలు నమోదు చేసిన ఈ కివీ స్టార్‌... టి20లకు అనుగుణంగా తన ఆటను మార్చుకొని మంచి ఫలితాలను సాధించడం చెప్పుకోదగ్గ విశేషం.

హైదరాబాదీల అభిమానం...
విలియమ్సన్‌ బ్యాటింగ్‌ శైలి చూస్తే అతను టి20లకు పనికి రాడని అంతా అనుకుంటారు. కానీ 2014 చాంపియన్స్‌ లీగ్‌లోనే అతను 48 బంతుల్లో సెంచరీతో తన వాడిని చూపించాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ జట్టు ద్వారా హైదరాబాద్‌ అభిమానులకు అతను చేరువయ్యాడు. 2015 నుంచి 2022 వరకు వరుసగా ఎనిమిది సీజన్ల పాటు ఇదే జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతను ‘కేన్‌ మామా’గానే సుపరిచితుడు. 

2016 టైటిల్‌ విజయంలో భాగంగా ఉన్నా... అతను పెద్ద పాత్ర పోషించలేదు. కానీ 2018లో డేవిడ్‌ వార్నర్‌ గైర్హాజరులో కేన్‌ జట్టును ఫైనల్‌ వరకు చేర్చాడు. 8 అర్ధ సెంచరీలు సహా 735 పరుగులతో ‘ఆరెంజ్‌ క్యాప్‌’ గెలుచుకొని ముందుండి నడిపించాడు. తాజా సీజన్‌లో లక్నో జట్టు సలహాదారుడిగా ఇప్పటికే ఐపీఎల్‌లో కేన్‌ రెండో ఇన్నింగ్స్‌ మొదలైంది.

‘వరల్డ్‌’ విజేతగా...
టెస్టుల్లో న్యూజిలాండ్‌ తరఫున అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు విలియమ్సన్‌ సొంతం. అయితే అరుదైన 10 వేల మైలురాయికి కేవలం 485 పరుగుల దూరంలో ఉన్న అతను సిరీస్‌ మధ్యలో రిటైర్మెంట్‌ ప్రకటించడం అనూహ్యం. అయితే తాను ఎప్పుడైనా వ్యక్తిగత ప్రదర్శనకంటే జట్టు గురించి ఆలోచించానని, ఇప్పుడు ‘టీమ్‌ షీట్‌లో ఒక పేరు’గా మాత్రమే ఉండి మరో రెండు మ్యాచ్‌లు పెంచదల్చుకోలేదని తన ఉద్దేశాన్ని కేన్‌ స్పష్టంగా చెప్పాడు. చాలా కాలంగా అతను ఫామ్‌లేమితో పాటు ఫిట్‌నెస్‌ సమస్యలతో కూడా బాధపడుతున్నాడు. 

తనకు నచ్చిన టోర్నీలు లేదా సిరీస్‌లలో ఆడేందుకు 2024 జూన్‌లోనే అతను న్యూజిలాండ్‌ బోర్డు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి తప్పుకున్నాడు. గాయం కారణంగానే భారత గడ్డపై న్యూజిలాండ్‌ 3–0తో గెలిచిన సిరీస్‌లో అతను ఆడలేదు. గత 9 ఇన్నింగ్స్‌లలో ఒకటే అర్ధసెంచరీ చేసిన కేన్‌... తాజాగా ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో 0, 18 పరుగులే నమోదు చేశాడు. దాంతో తప్పుకునేందుకు ఇదే సరైన సమయంగా భావించాడు. కెప్టెన్‌గా 2021 వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ను గెలిపించడం విలియమ్సన్‌ కెరీర్‌లోనే అత్యుత్తమ ఘట్టం. భారత్‌పై లక్ష్య ఛేదనలో రెండో ఇన్నింగ్స్‌లో అతను అజేయ అర్ధసెంచరీ సాధించాడు.  

గుండె పగిలిన క్షణం...
వన్డే క్రికెట్‌లో కూడా బ్యాటర్‌గా కేన్‌ తనదైన ముద్ర వేశాడు. మూడో స్థానంలో అతను ఏకంగా 51.16 సగటుతో పరుగులు సాధించడం అతని బ్యాటింగ్‌ గొప్పతనాన్ని చూపిస్తుంది. అతని 15 వన్డే సెంచరీల్లో 11 సార్లు జట్టు విజయం సాధించింది. అయితే కేన్‌ను మరచిపోకుండా చేసిన క్షణం 2019 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్లో వచ్చింది. ఈ టోర్నీలో అద్భుత ఆటతో 9 ఇన్నింగ్స్‌లలో అతను 578 పరుగులు చేశాడు. 

దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లపై శతకాలతో పాటు సెమీస్‌లో భారత్‌పై విజయంలో 67 పరుగులతో కీలకపాత్ర పోషించాడు. అయితే ఫైనల్లో కేన్‌ బృందాన్ని దురదృష్టం వెంటాడింది. మ్యాచ్, సూపర్‌ ఓవర్‌లలో సమంగా నిలిచినా కూడా ట్రోఫీ దక్కలేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ‘బౌండరీ కౌంట్‌’ రూల్‌తో కివీస్‌ రన్నరప్‌గానే నిలవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఇంగ్లండ్‌ మినహా ఇతర క్రికెట్‌ ప్రపంచం మొత్తం కూడా ఎంతో బాధపడిందంటే అతిశయోక్తి కాదు. టీమ్‌ను ఫైనల్‌ వరకు చేర్చిన విలియమ్సన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా కూడా నిలిచాడు.  

కేన్‌ విలియమ్సన్‌ అంతర్జాతీయ రికార్డు
టెస్టులు 110  
పరుగులు 9515 పరుగులు  
సగటు 54.06 
సెంచరీలు 33 
అర్ధ సెంచరీలు 38  
అత్యధిక స్కోరు 251

వన్డేలు 175 
పరుగులు 7256 
సగటు 48.69  
సెంచరీలు 15 
అర్ధ సెంచరీలు 47  
అత్యధిక స్కోరు 148

టి20లు 93 
పరుగులు 2575 
సగటు 33.44 
అర్ధ సెంచరీలు 18 
అత్యధిక స్కోరు 95 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)