Breaking News

నువ్వు సూపర్‌: పాక్‌ ఓపెనర్‌పై ఇర్ఫాన్‌ పఠాన్‌ సెటైర్లు

Published on Thu, 02/19/2026 - 10:28

పాకిస్తాన్‌ ఓపెనర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ ఆట తీరును భారత మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ విమర్శించాడు. నమీబియాతో మ్యాచ్‌లో ఫర్హాన్‌ సెంచరీ మార్కు అందుకున్న తీరు తనకు అంతగా నచ్చలేదని పేర్కొన్నాడు.

టీ20 ప్రపంచకప్‌-2026లో తదుపరి దశకు అర్హత పొందాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ జట్టు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆఫ్రికా పసికూన నమీబియా జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 102 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు
తద్వారా ఈ టోర్నీలో మూడో గెలుపుతో పాకిస్తాన్‌ ఆరు పాయింట్లతో గ్రూప్‌ ‘ఎ’లో రెండో స్థానంలో నిలిచి ‘సూపర్‌–8’ దశకు చేరుకుంది. కొలంబో వేదికగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.

సింగిల్‌ తీసి
ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ 58 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు బాది అజేయంగా నిలిచాడు. ఆఖరి ఓవర్లో నమీబియా కెప్టెన్‌ గెర్హాడ్‌ ఎరాస్మస్‌ బౌలింగ్‌లో రెండో బంతికి సింగిల్‌ తీసి ఫర్హాన్‌ శతక మార్కు అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఆఖరిదైన ఆరో బంతిని ఎదుర్కొని పరుగులేమీ తీయలేకపోయాడు.

సెంచరీ కోసం డిఫెన్సివ్‌ షాట్‌
ఈ నేపథ్యంలో కామెంటేటర్‌, టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఫర్హాన్‌ను విమర్శించాడు. కాస్త ధైర్యంగా షాట్లు బాది ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ‘‘అతడు సెంచరీ చేశాడని ఒప్పుకంటాను. కానీ సింగిల్‌ తీసి వంద పరుగుల మార్కు అందుకుంటాడా?.. ఇదేమీ అంత బాగా లేదు.

నువ్వు సెంచరీ పూర్తి చేసుకుంటే సంతోషంగా ఉంటావా? లేదంటే పాకిస్తాన్‌ 199 పరుగుల వద్దే ఆగిపోతే ఆనందంగా ఉంటావా? ఆఖరి ఓవర్లో సెంచరీ కోసం డిఫెన్సివ్‌ షాట్‌ ఆడావు!

ఇక చివరి బంతినైతే ఏకంగా అలా వదిలేశావు. సూపర్‌ నువ్వు’’ అంటూ ఇర్ఫాన్‌ పఠాన్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఆఖరి ఓవర్లో రెండు సిక్స్‌లు బాదిన షాదాబ్‌ ఖాన్‌ ఫర్హాన్‌ కంటే బెటర్‌ అంటూ ఘాటుగా విమర్శించాడు. 

కాగా పాక్‌ విధించిన 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా.. 17.3 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. ఫలితంగా 102 పరుగుల తేడాతో గెలిచి సూపర్‌-8కు అర్హత సాధించింది.

చదవండి: T20 WC 2026: సూపర్‌-8 షెడ్యూల్‌ ఇదే.. ఎవరు ఎవరితో ఢీ?

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)