Breaking News

విండీస్‌కు ఆపద్బాంధవుడిలా.. మొన్న బంతితో, ఇవాళ బ్యాట్‌తో!

Published on Mon, 08/03/2026 - 12:05

ట్రినిడాడ్ వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ బ్యాట‌ర్ జ‌స్టిన్ గ్రీవ్స్ మ‌రోసారి ఆపద్బాంధవుడి పాత్ర‌ను పోషించాడు. అయితే ఈసారి బౌల‌ర్‌గా కాకుండా బ్యాట‌ర్‌గా త‌న విలువ‌ను ప్ర‌ద‌ర్శించాడు. పాక్‌తో జ‌రిగిన తొలి టెస్టులో వ‌రుస ఐదు ఓవ‌ర్ల‌లో ఐదు మెయిడెన్ వికెట్లు తీసి చ‌రిత్ర సృష్టించిన జ‌స్టిన్ గ్రీవ్స్ ఈసారి బ్యాట్‌తో (125 బంతుల్లో 64 నాటౌట్‌) రాణించాడు. 

తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి వెస్టిండీస్ 5 వికెట్ల న‌ష్టానికి 239 ప‌రుగులు చేసింది. గ్రీవ్స్‌తో పాటు కెప్టెన్ రోస్ట‌న్ చేజ్ (36 బ్యాటింగ్‌) క్రీజులో కొన‌సాగుతున్నాడు. అంత‌క‌ముందు ఓపెన‌ర్ బ్రాండ‌న్ కింగ్ (46) అర్ధ‌శ‌త‌కం మిస్ చేసుకోగా, అమిర్ జాంగో (26), షెయ్ హోప్ (29) ప‌ర్వాలేద‌నిపించారు. పాకిస్తాన్ బౌల‌ర్ల‌లో మొహ‌మ్మ‌ద్ అలీ 2 వికెట్లు తీయ‌గా, ఉబైద్ షా, అలీ ఉస్మాన్, సాజిద్ ఖాన్‌లు త‌లా ఒక వికెట్ తీశారు. 

ఇదే స్టేడియంలో జ‌రిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ 90 ప‌రుగుల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక తొలి వికెట్‌కు బ్రాండ‌న్ కింగ్‌, ట‌గ్ న‌రైన్ చంద్ర‌పాల్ (15) 49 ప‌రుగులు జోడించిన త‌ర్వాత విండీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన బ్యాట‌ర్ల‌లో పెద్ద‌గా ఎవ‌రు ఆకట్టుకోలేదు. 120 ప‌రుగుల వ‌ద్ద వెస్టిండీస్‌ నాలుగో వికెట్ కోల్పోవ‌డంతో జ‌స్టిన్ గ్రీవ్స్ క్రీజులోకి వ‌చ్చాడు. 

క్రీజులోకి వ‌చ్చిందే మొద‌లు త‌న‌లోని క్లాస్ బ్యాట‌ర్‌ను బ‌య‌టికి తీసిన గ్రీవ్స్ నింపాదిగా ఆడాడు. వీలైన‌ప్పుడ‌ల్లా బంతుల‌ను బౌండరీల‌ను త‌ర‌లించాడు. షెయ్ హోప్ ఔటైన త‌ర్వాత మ‌రింత బాధ్య‌త‌గా ఆడిన గ్రీవ్స్ టెస్టుల్లో మూడో అర్థ‌సెంచ‌రీని సాధించాడు. చేజ్‌తో క‌లిసి ఆరో వికెట్‌కు గ్రీవ్స్ అజేయంగా 66 పరుగులు జోడించ‌డంతో విండీస్ మ‌ళ్లీ ట్రాక్‌లో ప‌డింది. రెండో రోజు ఆట‌లో ఈ ఇద్ద‌రు ఎంత‌సేపు బ్యాటింగ్ చేస్తార‌నే దానిపై విండీస్ స్కోరు ఆధార‌ప‌డి ఉంది.

 

Read: తీవ్ర అసంతృప్తిలో గిల్‌, గంభీర్‌.. వాళ్లపై బీసీసీఐ వేటు!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)