టీ20 క్రికెట్‌లో జోస్ బ‌ట్ల‌ర్ ప్ర‌పంచ రికార్డు

Published on Thu, 08/06/2026 - 07:08

హండ్రెడ్ మెన్స్ కాంపిటీష‌న్‌లో మాంచెస్ట‌ర్ సూప‌ర్‌జెయింట్స్ కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్ ప్ర‌పంచ రికార్డు నెల‌కొల్పాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా వెల్ష్‌ఫైర్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో బ‌ట్ల‌ర్ 20 బంతుల్లో 51 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచి టీ20 క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగులు (491 ఇన్నింగ్స్‌ల్లో 14,833 ప‌రుగులు) చేసిన బ్యాట‌ర్‌గా  బ‌ట్ల‌ర్ చ‌రిత్ర సృష్టించాడు. 

ఈ క్ర‌మంలో ఇప్ప‌టివ‌ర‌కు టీ20 క్రికెట్ చ‌రిత్ర‌లో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీర‌న్ పొలార్డ్ పేరిట ఉన్న అత్య‌ధిక ప‌రుగుల (14,803 ప‌రుగులు)రికార్డు బ‌ట్ల‌ర్ బ‌ద్ద‌లు కొట్టాడు. బ‌ట్ల‌ర్‌, పొలార్డ్ త‌ర్వాత విండీస్ హార్డ్ హిట్ట‌ర్, మాజీ ఆట‌గాడు క్రిస్ గేల్ (14, 562 ప‌రుగులు) మూడో స్థానంలో కొన‌సాగుతున్నాడు.

ఇక మ్యాచ్ విష‌యానికొస్తే.. వెల్ష్‌ఫైర్‌పై మాంచెస్ట‌ర్ సూప‌ర్‌జెయింట్స్ 9 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. వెల్ష్‌ఫైర్ విధించిన 156 ప‌రుగుల టార్గెట్‌ను మాంచెస్ట‌ర్ జెయింట్స్‌ మ‌రో 31 బంతులు మిగిలి ఉండ‌గానే ఛేదించింది. ఓపెన‌ర్ టిమ్ సీఫెర్ట్ (36 బంతుల్లో 62 నాటౌట్‌), బ‌ట్ల‌ర్ (20 బంతుల్లో 51 నాటౌట్‌) ధాటిగా ఆడి జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చారు. 

మ‌రో ఓపెన‌ర్ పాల్ వాల్ట‌ర్ (18 బంతుల్లో 37) రాణించాడు. అంత‌క‌ముందు వెల్ష్ ఫైర్ 100 బంతుల్లో 4 వికెట్ల న‌ష్టానికి 155 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్  మాథ్యూ షార్ట్ (47 బంతుల్లో 71) విధ్వంసం సృష్టించ‌గా, మ‌రో ఓపెన‌ర్ ఫిలిప్ సాల్ట్ (48) రాణించాడు. మాంచెస్ట‌ర్ బౌల‌ర్ల‌లో గ‌స్ అకిన్‌స‌న్ 2 వికెట్లు తీయ‌గా, జోష్ టంగ్‌, పాల్ వాల్ట‌ర్ చెరొక వికెట్ తీశారు. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన టిమ్ సీఫెర్ట్ 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌'గా నిలిచాడు.

మార్కరమ్ స్థానంలో కెప్టెన్‌గా
ఇక మాంచెస్టర్ రెగ్యులర్ కెప్టెన్ ఐడెన్ మార్కరమ్ వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి వైదొలగడంతో బట్లర్ తొలిసారి జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్లోనే విజయాన్ని సాధించాడు. ఇప్పటికే సౌతాఫ్రికా వెళ్లిపోయిన మార్కరమ్ మిగతా టోర్నీకి దూరమవ్వడంతో బట్లర్ జట్టును నడిపించనున్నాడు. 

ఇక బట్లర్ బ్యాటర్‌గా హం‍డ్రెడ్ టోర్నీలో అదరగొడుతున్నాడు. ఈ వికెట్ కీపర్ ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 92.3 స్ట్రైక్ రేట్‌తో 277 పరుగులు సాధించాడు. ఇక మార్కరమ్ స్థానంలో మైకెల్ బ్రాస్‌వెల్‌ను తీసుకున్నట్లు మాంచెస్టర్ ఫ్రాంచైజీ ప్రకటించింది. 

 

 

Read: నా ఫెవ‌రేట్ కోచ్ అతడే.. గంభీర్ మాత్రం కాదు: ష‌మీ

Videos

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు

NTR జిల్లాలో YS జగన్ పాటలతో గణేశ్ నిమజ్జనం

చింతమనేని నీకే చెప్తున్నా.. దెందులూరు గడ్డ సాక్షిగా.. అబ్బాయి చౌదరీ నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

ఒక్కొక్కడికి ఇదే చెప్పడం.. వంగవీటి ఆశ మాస్ వార్నింగ్

తండ్రీ కొడుకుల రహస్య ప్రయాణాలు

విజయవాడ ధర్నా చౌక్ వద్ద హైటెన్నన్.. YSRCP నేతలు VS పోలీసులు

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

Photos

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)