మధ్యప్రాచ్యంలో యుద్దం.. ఆపదలో ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌

Published on Mon, 03/02/2026 - 19:29

ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌ జానీ బెయిర్‌స్టో ఆపదలో ఉన్నాడు. అమెరికా, ఇజ్రాయిల్‌-ఇరాన్‌ యుద్ద నేపథ్యంలో కుటుంబంతో సహా దుబాయ్‌లో చిక్కుకుని, బిక్కుబిక్కుమంటున్నాడు. బెయిర్‌స్టో కొద్ది రోజుల కిందట కుటుంబంతో కలిసి దుబాయ్‌ పర్యటనకు వెళ్లాడు. 

వారు తిరిగి స్వదేశానికి బయల్దేరాల్సిన సమయంలో మధ్యప్రాచ్యంలో యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. దీంతో దుబాయ్‌ విమానాశ్రయం సహా మధ్యప్రాచ్యంలోని అన్ని విమానాశ్రయాలు మూసివేయబడ్డాయి. ఎ‍క్కడి వారు అక్కడే బిక్కుబిక్కుమంటూ కలం వెల్లదీస్తున్నారు.

ముందుగా బెయిర్‌స్టో అబుదాబీలో పర్యటిస్తున్న ఇంగ్లండ్‌ లయన్స్‌ బృందంలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇందులో నిజం​ లేదని బెయిర్‌స్టో స్వయంగా స్పష్టం చేశాడు. తాను కుటుంబంతో సహా దుబాయ్‌లో చిక్కుకున్నట్లు ఎక్స్‌ వేదికగా వెల్లడించాడు.

ఇంగ్లండ్ లయన్స్‌ను భద్రతా సిబ్బంది అబుదాబి నుండి బయటకు తీసుకురావడానికి చేయగలిగినదంతా చేస్తుందని అనుకుంటున్నాను. నేను నా కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుకొని, ఇక్కడి నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానని ఎక్స్‌లో రాసుకొచ్చాడు.

కాగా, మధ్యప్రాచ్యంలో యుద్ధ ప్రభావం క్రికెట్‌పై కూడా పడింది. ఈ యుద్ధం కారణంగా అబుదాబీలో జరగాల్సిన పాకిస్తాన్‌ షాహీన్స్‌-ఇంగ్లండ్‌ లయన్స్‌ వన్డే సిరీస్‌ రద్దైంది. ఇక్కడే ఏర్పాటు చేసిన ఇంగ్లండ్‌ మహిళల జట్టు శిక్షణ కార్యక్రమం కూడా వాయిదా పడింది. 

త్వరలో దుబాయ్‌, అబుదాబీ వేదికలుగా ఆఫ్ఘనిస్తాన్‌-శ్రీలంక మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌ జరగాల్సి ఉంది. ఈ సిరీస్‌ కూడా సందిగ్దంలో పడింది. మరోవైపు సౌతాఫ్రికాలో పరిమిత ఓవర్ల సిరీస్‌ ముగించుకున్న పాకిస్తాన్‌ మహిళల క్రికెట్‌ జట్టు కూడా దుబాయ్‌ విమానాశ్రయం మూసివేయడంతో డర్బన్‌లోనే ఇరుక్కుపోయింది. 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)