Breaking News

క్యాచ్‌ మిస్‌ కొంపముంచింది.. జట్టును గెలిపించిన జెమీమా!

Published on Fri, 07/31/2026 - 15:35

హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్ 2026లో భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ విధ్వంసం జోరుగా కొనసాగుతోంది. టోర్నీలో సదరన్ బ్రేవ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జెమీమా వరుసగా మూడో మ్యాచ్‌లోనూ మెరిసింది. గురువారం రాత్రి బ‌ర్మింగ్‌హ‌మ్ ఫోనిక్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 24 ప‌రుగుల తేడాతో స‌ద‌ర‌న్ బ్రేవ్ వ‌రుస‌గా నాలుగో విజ‌యాన్ని అందుకొని టేబుల్ టాప‌ర్లుగా నిలవ‌గా, ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓట‌మి చ‌విచూసిన బ‌ర్మింగ్‌హ‌మ్ మాత్రం విజ‌యం కోసం చ‌కోర ప‌క్షిలా ఎదురుచూస్తూనే ఉంది. 

అయితే స‌ద‌ర‌న్ బ్రేవ్ విజ‌యంలో జెమీమా మ‌రోసారి కీల‌క‌పాత్ర పోషించింది. ఆఖ‌ర్లో బ్యాటింగ్‌కు వ‌చ్చిన జెమీమా 18 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 28 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచింది. అయితే క్రీజులోకి వ‌చ్చిన వెంట‌నే క్యాచ్ ఔట‌య్యే ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్న జెమీమా త‌న‌కు వ‌చ్చిన రెండో చాన్స్‌ను రెండు చేతులా ఒడిసిప‌ట్టింది. మూడు ఫోర్ల‌తో చివ‌ర్లో స‌ద‌ర‌న్ బ్రేవ్ భారీ స్కోరు చేయ‌డంలో స‌హాయ‌ప‌డింది. 

ఒక‌వేళ జెమీమా ఆరంభంలోనే ఔట‌య్యి ఉంటే ప‌రిస్థితి వేరుగా ఉండేదేమో. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇక మ్యాచ్ విష‌యానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన స‌ద‌ర‌న్ బ్రేవ్ వుమెన్ జ‌ట్టు 100 బంతుల్లో 3 వికెట్ల న‌ష్టానికి 140 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్లు మ‌యియా బౌచ‌ర్ (31 బంతుల్లో 45), లిజెల్లే లీ (28 బంతుల్లో 43) ధాటిగా ఆడారు. వీరిద్ద‌రు ఔటైన త‌ర్వాత జెమీమా (18 బంతుల్లో 28 నాటౌట్‌) అజేయంగా నిలిచింది. 

బ‌ర్మింగ్‌హ‌మ్ బౌల‌ర్ల‌లో లారెన్ ఫైల‌ర్, అలానా కింగ్‌, అలిస్ కాప్సీ త‌లా ఒక వికెట్ తీశారు. అనంత‌రం బర్మింగ్‌హ‌మ్ ఫోనిక్స్ 100 బంతుల్లో 5 వికెట్ల న‌ష్టానికి 116 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఓపెన‌ర్ డేవినా పెర్రిన్ (43 బంతుల్లో 52) అర్ధ‌సెంచ‌రీ వృథాగా మార‌గా, టామీ బ్యూమౌంట్ (22) ప‌ర్వాలేద‌నిపించింది. స‌ద‌ర‌న్ బౌల‌ర్ల‌లో సోఫీ మొలినెక్స్ రెండు వికెట్లు తీయ‌గా, టిల్లీ కొర్టీన్‌, సారా గ్లెన్‌, లారెన్ బెల్‌లు త‌లా ఒక వికెట్ తీశారు.

 

Read: రహానే వీడ్కోలుపై లేటుగా స్పందించిన రోహిత్‌!

Videos

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

ఆసియా గేమ్స్ మహిళల కబడ్డీలో భారత్ కు స్వర్ణం

ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే... కాకుమానుపై పోలీసుల తీరు.. అడ్వకేట్ రజినీ షాకింగ్ నిజాలు

Photos

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)