Breaking News

రెండు రోజుల్లో 2 కిలోలు తగ్గాడు.. జైస్వాల్‌కు ఏమైంది?

Published on Thu, 12/18/2025 - 21:29

టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్‌డేట్‌ అందింది. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని.. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సన్నిహితులు జాతీయ మీడియాకు వెల్లడించారు. కాగా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ ముగిసిన తర్వాత జైసూ.. దేశీ టీ20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2025లో ముంబై తరపున బరిలోకి దిగాడు.

మొత్తంగా మూడు మ్యాచ్‌లు ఆడి 145 పరుగులు సాధించాడు జైసూ (Yashasvi Jaiswal). ఇందులో ఓ శతకం కూడా ఉంది. అయితే, రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు జైస్వాల్‌ అస్వస్థతకు గురయ్యాడు. అయినప్పటికీ పుణె వేదికగా రాజస్తాన్‌తో మ్యాచ్‌ బరిలో దిగి.. 15 పరుగులు చేసి అవుటయ్యాడు.

 తీవ్రమైన కడుపు నొప్పి
అయితే, ఈ సూపర్‌ లీగ్‌ మ్యాచ్‌ తర్వాత జైస్వాల్‌ తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డాడు. ఈ క్రమంలో వెంటనే హుటాహుటిన పుణెలోని ఆదిత్య బిర్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షల అనంతరం పొట్టలో తీవ్రమైన ఇన్షెక్షన్‌ ఉన్నట్లు వైద్యులు తేల్చారు.

ఈ నేపథ్యంలో విశ్వసనీయ వర్గాలు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఫుడ్‌ పాయిజన్‌ (Food Poison) అయింది. పుణె హోటళ్లో జైస్వాల్‌ తిన్న కలుషిత ఆహారమే ఇందుకు దారితీసింది. తీవ్రమైన నొప్పితో అతడు విలవిల్లాడాడు.

రెండు రోజుల్లో 2 కిలోలు తగ్గాడు
అయితే, వైద్యుల చికిత్స తర్వాత నెమ్మదిగా కోలుకుంటున్నాడు. రెండు రోజుల్లోనే రెండు కిలోల బరువు తగ్గిపోయాడు. పూర్తిగా కోలుకోవడానికి 7- 10 రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు’’ అని పేర్కొన్నాయి.

ఈ నేపథ్యంలో జైస్వాల్‌ దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ మ్యాచ్‌లకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. న్యూజిలాండ్‌తో సిరీస్‌ నాటికి 23 ఏళ్ల ఈ యువ ఓపెనర్‌ తిరిగి టీమిండియాతో చేరే అవకాశం ఉంది. 

కాగా రాజస్తాన్‌తో సూపర్‌ లీగ్‌ మ్యాచ్‌లో ముంబై గెలిచినప్పటికీ.. నెట్‌ రన్‌ రేటు తక్కువగా ఉన్న కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ టోర్నీలో పుణె వేదికగా గురువారం జరిగిన ఫైనల్లో హర్యానాను ఓడించి జార్ఖండ్‌ విజేతగా నిలిచింది.

చదవండి: AUS vs ENG: ఆర్చర్‌పై స్టోక్స్‌ ఫైర్‌!.. చెంప చెళ్లుమనిపించేలా రిప్లై

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)