Breaking News

సెంచ‌రీతో చెల‌రేగిన జ‌డేజా.. సౌరాష్ట్ర భారీ స్కోరు

Published on Mon, 10/12/2026 - 13:09

టీమిండియా సీనియ‌ర్‌ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా రంజీ ట్రోఫీలో సెంచ‌రీతో మెరిశాడు. సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న జ‌డేజా ఛ‌త్తీస్‌గ‌ఢ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో శ‌త‌కం సాధించాడు. 205 బంతుల్లో సెంచ‌రీ మార్క్ అందుకున్న జ‌డేజా 102 ప‌రుగుల వ‌ద్ద ధర్మేంద్ర సిన్హా జ‌డేజా బౌలింగ్‌లో  ఆఖ‌రి వికెట్‌గా వెనుదిరిగాడు. జ‌డ్డూ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు ఉన్నాయి. 

కాగా జ‌డేజా కెరీర్‌లో ఇది 16వ ఫ‌స్ట్‌క్లాస్ సెంచ‌రీ. జ‌డేజాకు తోడు మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ ప్రేర‌క్ మ‌న్క‌డ్ (150 బంతుల్లో 129) కూడా సెంచ‌రీ చేయ‌డంతో సౌరాష్ట్ర 392 ప‌రుగులు చేసింది. అంత‌క‌ముందు ఓపెన‌ర్ చిరాగ్ జాని (83) అర్థ‌సెంచ‌రీతో రాణించాడు. ఛ‌త్తీస్‌గ‌ఢ్ బౌల‌ర్ల‌లో దేవ్ ఆదిత్య సింగ్ ఐదు వికెట్ల‌తో చెల‌రేగ‌గా, ధ‌ర్మేంద్ర సిన్హా జ‌డేజా, రుద్ర‌ప్ర‌తాప్ దెహారి చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. అనంత‌రం బ్యాటింగ్ ఆరంభించిన ఛ‌త్తీస్‌గ‌ఢ్ ఆరు ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టానికి 22 ప‌రుగులు చేసింది.

ఇటీవ‌లే వెస్టిండీస్‌తో జ‌రిగిన మూడు వ‌న్డే మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడిన జ‌డేజా రెండు మ్యాచ్‌లాడి రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. బ్యాటింగ్‌లో మాత్రం అవ‌కాశం రాలేదు. ఈ నెల చివ‌రి వారంలో న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో జ‌డేజా రంజీల్లో సౌరాష్ట్ర త‌ర‌ఫున ఆడుతున్నాడు. వ‌న్డే, టెస్టుల్లో మాత్ర‌మే కొన‌సాగుతున్న జ‌డేజా ముఖ్యంగా రెడ్‌బాల్ క్రికెట్‌పై దృష్టి సారించాడు. అందుకే రంజీల్లో సౌరాష్ట్ర త‌ర‌ఫున ఆడుతున్న జ‌డ్డూ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ మెరిసి కివీస్‌తో సిరీస్‌కు ముందు ప్రాక్టీస్‌గా ఉప‌యోగించుకుంటున్నాడు.

ఇదీ చ‌ద‌వండి: 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)