Breaking News

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌.. ఇషాన్‌ కిషన్‌ అరంగేట్రం! ఆంధ్ర ఆటగాడికి నో ఛాన్స్‌

Published on Tue, 07/04/2023 - 14:06

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియా అన్ని విధాల సిద్దమవుతోంది. ఇప్పటికే విండీస్‌ గడ్డపై అడుగుపెట్టిన రోహిత్‌ సేన తమ ప్రా‍క్టీస్‌ను కూడా మొదలు పెట్టేసింది. జూలై 12 నుంచి  డొమెనికా వేదికగా భారత్‌-విండీస్‌ టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది. అయితే టెస్టు సిరీస్‌ ఆరంభానికి ముందు టీమిండియా స్ధానిక జట్టుతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌  ఆడనుంది. ఈ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ రెండు రోజులు(జూలై 5, 6) పాటు జరగనుంది.

ఇక ఈ విషయం పక్కన పెడితే.. విండీస్‌ తొలి టెస్టుకు తుది జట్టును ఎంపిక చేయడం భారత జట్టుకు పెద్ద సవాలుగా మారింది. ఎందకంటే ఈ సిరీస్‌కు వెటరన్‌ ఆటగాడు ఛతేశ్వర్‌ పుజారాను పక్కన పెట్టడంతో ఆ స్ధానాన్ని ఎవరితో భర్తీ చేయాలో ఆర్ధంకాక మెనెజ్‌మెం‍ట్‌ తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం.

ఆ స్ధానంలో యువ ఆటగాళ్లు యశస్వీ జైశ్వాల్‌ లేదా రుత్‌రాజ్‌ గైక్వాడ్‌కు అవకాశం ఇవ్వాలో తెలియక సం‍దిగ్థంలో పడినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ దేశావాళీ క్రికెట్‌లో ఓపెనర్లగా ఆడిన అనుభవం ఉంది గానీ టాపర్డర్‌లో అంతగా ఎక్స్‌పీరియన్స్‌ లేదు. కానీ వీరిద్దరూలో ఎవరో ఒకరు విండీస్‌ తొలి టెస్టుతో అంతర్జాతీయ అరంగేట్రం చేయడం ఖాయం. అది ఎవరన్నది తొలి టెస్టు వరకు వేచి చూడక తప్పదు

కిషన్‌ అరంగేట్రం..
ఇక విండీస్‌తో తొలి టెస్టుతో యువ వికెట్‌ కీపర్ ఇషాన్‌ కిషన్‌ టెస్టుల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. మరో యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ శ్రీకర్‌ భరత్‌ విండీస్‌ టెస్టులకు ఎంపికైనప్పటికీ.. తుది జట్టులో మాత్రం చోటు దక్కడం అనుమానమే. భరత్‌ వికెట్లు వెనుక అద్భుతంగా ఉన్నప్పటికీ.. బ్యాటింగ్‌లో మాత్రం తీవ్ర నిరాశపరుస్తున్నాడు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన భరత్‌.. ఆ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన కేవలం 101 పరుగులు చేశాడు. దీంతో పాటు ఇటీవల జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కూడా కేఎస్ భరత్‌కి ఫైనల్‌లో అవకాశం లభించింది. అక్కడ కూడా బ్యాట్‌తో విఫలమయ్యాడు.  రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో అతడిని పక్కన పెట్టి కిషన్‌కు ఓ అవకాశం ఇచ్చి చూడాలని జట్టు మెనెజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం.
చదవండి: Kohli And Rohit Sharma: ‘అజిత్‌ అగార్కర్‌ వచ్చిన తర్వాతే ఆ కీలక ప్రకటన! ఇక కోహ్లి, రోహిత్‌..’

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)