Breaking News

RBI అసిస్టెంట్‌ మేనేజర్‌గా ఇషాన్‌ కిషన్‌.. జీతం ఎంతంటే?

Published on Wed, 08/05/2026 - 14:37

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌కు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అసిస్టెంట్‌ మేనేజర్‌ విధుల్లో భాగంగా.. సహచర ఉద్యోగులతో అతడు కలిసి ఉన్న దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

టీమిండియా రీఎంట్రీలో అదుర్స్‌
అసలు విషయం ఏమిటంటే.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ గత కొంతకాలంగా టీమిండియా తరఫున బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దేశీ క్రికెట్లో సత్తా చాటిన ఈ జార్ఖండ్‌ పాకెట్‌ డైనమైట్‌ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్‌-2026లో అదరగొట్టి జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు.

ఇటీవల ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌, జింబాబ్వే పర్యటనలతో బిజీగా గడిపిన ఇషాన్‌ కిషన్‌.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. టీమిండియా టెస్టు సిరీస్‌ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లగా ఇషాన్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. దీంతో స్వస్థలంలో ఉన్న అతడు.. ఆర్బీఐ విధుల్లో చేరినట్లుగా ఉన్న ఫొటో ఒకటి తాజాగా వైరల్‌ అవుతోంది.

పాట్నాలోని ప్రాంతీయ కార్యాలయంలో
కాగా స్పోర్ట్స్‌ కోటాలో భాగంగా ఇషాన్‌ కిషన్‌కు చాన్నాళ్ల క్రితమే ఆర్బీబీలో ఉద్యోగం వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం అతడు అసిస్టెంట్‌ మేనేజర్‌ హోదాలో ఉన్నట్లు తెలుస్తోంది. న్యూస్‌18 కథనం ప్రకారం.. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి విరామం లభించగా.. ఇషాన్‌ ఆర్బీఐ విధుల్లో చేరాడు. 

పాట్నాలోని ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లిన ఇషాన్‌కు సహచర ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికినట్లు తెలుస్తోంది. అతడితో ఫొటోలు దిగి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. అవి వైరల్‌గా మారాయి.

జీతం ఎంతంటే..?
కాగా ఆర్బీఐ అసిస్టెంట్‌ మేనేజర్‌గా నెలకు ఇషాన్‌ కిషన్‌కు రూ. 1.22 లక్షల నుంచి 1.24 లక్షల వరకు వేతనం అందుతున్నట్లు తెలుస్తోంది. ప్రొవిడెంట్‌ ఫండ్‌ సహా మిగతా కటింగ్స్‌ అన్నీ పోనూ చేతికి దాదాపు రూ. 1.12 లక్షలు అందుతున్నట్లు సమాచారం.

ఇక ఆగష్టు 23 నుంచి దేశవాళీ ప్రతిష్టాత్మక రెడ్‌బాల్‌ టోర్నీ దులిప్‌ ట్రోఫీ మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈస్ట్‌ జోన్‌ జట్టుకు ఇషాన్‌ కిషన్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. త్వరలోనే మళ్లీ అతడు ఆటతో బిజీ కానున్నాడు. ఈ జట్టుకు బిహార్‌ చిచ్చరపిడుగు, టీమిండియా ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ వైస్‌ కెప్టెన్‌.

క్రికెట్ వదిలి ఆఫీస్ కి ఇషాన్ కిషన్ శాలరీ ఎన్ని లక్షలో తెలుసా ?

కాగా 2021లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఇషాన్‌ కిషన్‌.. ఇప్పటి వరకు 32 వన్డేలు, 55 టీ20 మ్యాచ్‌లు, 2 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 1107, టీ20లలో 1608 పరుగులు.. టెస్టుల్లో 78 రన్స్‌ చేశాడు ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.

చదవండి: అనుష్క శర్మ అలా చేస్తే తప్పేంటి?: షమీ

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)