పెళ్లి పీటలెక్కబోతున్న ఇషాన్‌ కిషన్‌

Published on Mon, 02/16/2026 - 17:06

టీమిండియా పాకెట్‌ డైనమైట్‌ ఇషాన్‌ కిషన్‌ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌తో బిజీగా ఉన్న అతను.. మెగా టోర్నీ ముగిసాక తన ప్రేయసి అదితి హుండియాను మనువాడబోతున్నాడని సమాచారం. ఈ విషయాన్ని ఇషాన్‌ తాత అనురాగ్‌ పాండే స్వయంగా వెల్లడించారు. 

ఏఎన్‌ఐతో ఆయన మాట్లాడుతూ.. ఇషాన్‌ ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకున్నా, తాము అంగీకరించేందుకు సిద్దంగా ఉన్నాము. ఇషాన్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ పేరు అదితి. ఆమె ఓ మోడల్‌. పిల్లలను సంతోషపెట్టే వాటిని పెద్దలు అంగీకరించాలని అన్నాడు.

ఇషాన్‌కు సంబంధించిన ఈ వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఇషాన్‌ నిన్న (ఫిబ్రవరి 15) టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా పాకిస్తాన్‌పై చెలరేగిపోయాడు. కేవలం 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేశాడు. 

ఈ ఇన్నింగ్స్‌ ప్రధాన కారణంగా భారత్‌ పాక్‌ను 61 పరుగుల తేడాతో చిత్తు ఓడించింది. తన విధ్వంసకర ప్రదర్శనకు గానూ ఇషాన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ​మ్యాచ్‌ అవార్డు కూడా గెలుచుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌ జట్టులోకి అనూహ్యంగా వచ్చిన ఇషాన్‌ అంచనాలకు మించి రాణిస్తూ.. భారత క్రికెట్‌ అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తున్నాడు.

పాక్‌పై వీరబాదడు తర్వాత ఇషాన్‌ పెళ్లి ప్రస్తావన రావడం అభిమానులకు జోష్‌నిస్తుంది. వాస్తవానికి ఇషాన్‌-అదితి బంధంపై చాలా రోజులుగా సోషల్‌మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తుండేవి. కొందరు వీరిని ప్రేమికులంటే, మరికొందరు కేవలం స్నేహితులు మాత్రమేనని అన్నారు. 

ఇషాన్‌ తాత తాజా ప్రకటనతో ఇషాన్‌-అదితి బంధం బహిర్గతమైపోయింది. పెళ్లిపై ఇషాన్‌ కాని, అదితి కాని ఎలాంటి అధికారిక​ ప్రకటన చేయకపోయినా, ఇరు కుటుంబాల్లో పెళ్లి చర్చలు మొదలయ్యాయనే విషయం సుస్పష్టమైంది.

ఎవరీ అదితి హుండియా..?
ఇషాన్‌ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిగా చెప్పుకుంటున్న అదితి హుండియా జైపూర్‌కు చెందిన ఓ ప్రముఖ మోడల్‌. ఈ అమ్మాయి 1997 జనవరి 15న జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 29 సంవత్సరాలు. అదితి జైపూర్‌లోని ప్రముఖ వ్యాపార కుటుంబంలో జన్మించింది. 

అదితి పాఠశాల విద్యను ఇండియా ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ జైపూర్‌లో అభ్యసించింది. జైపూర్‌లోని సెయింట్‌ జేవియర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కాలేజీ విద్యను పూర్తి చేసింది. అదితికి మోడలింగ్‌ అంటే పిచ్చి. ఆమె 2016లో ఎలైట్‌ మిస్‌ రాజస్థాన్‌ రన్నరప్‌గా నిలిచింది. 

ఆతర్వాత 2018 మిస్‌ దివా కిరీటాన్ని కైవసం చేసుకుంది. 2017 ఫెమినా మిస్‌ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. 2018లో మిస్‌ సుప్రానేషనల్‌ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది. అదితికి ఫ్యాషన్ రంగంలోనూ మంచి గుర్తింపు ఉంది. 

ఆమెకు సోషల్ మీడియాలో 2.7 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. అదితి మోడల్‌గా, ఇన్‌ఫ్లూయెన్సర్‌గా నెటిజన్లకు సుపరిచితురాలు. అదితి 2019లో Pehla Wargi అనే వీడియో ఆల్బమ్‌లోనూ నటించింది.

ఇషాన్‌-అదితి మధ్య బంధం 2019 ఐపీఎల్‌ సమయంలో బయటపడింది.అప్పటి నుంచి ఆమె తరుచూ ఇషాన్‌తో కనిపించేది. తాజాగా పెళ్లి ప్రస్తావన రావడంతో అదితి ఎవరనే విషయాన్ని క్రికెట్‌ అభిమానులు గూగుల్‌ చేయడం మొదలుపెట్టారు. 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)