Breaking News

ఇషాన్‌ కిషన్‌ ప్రపంచ రికార్డు

Published on Mon, 12/01/2025 - 14:06

టీమిండియా యువ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్లో ఇంత వరకు ఏ ఆటగాడికి సాధ్యం కాని ఫీట్‌తో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. దేశవాళీ టీ20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2025లో ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) తన సొంత జట్టు జార్ఖండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయ తెలిసిందే.

182 పరుగులు
ఈ టోర్నీలో ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’లో భాగంగా ఆదివారం జరిగిన పోరులో జార్ఖండ్‌... త్రిపుర (Jharkhand vs Tripura) జట్టుతో తలపడింది. అహ్మదాబాద్‌ వేదికగా టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన త్రిపుర నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. 

విజయ్‌ శంకర్‌ (41 బంతుల్లో 59; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకం చేయగా... బ్రికమ్‌ కుమార్‌ దాస్‌ (29 బంతుల్లో 42; 6 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ మణిశంకర్‌ (21 బంతుల్లో 42; 5 సిక్స్‌లు) రాణించారు.

సెంచరీతో కదం తొక్కిన ఇషాన్‌ కిషన్‌
జార్ఖండ్‌ బౌలర్లలో వికాస్‌ సింగ్, అనుకూల్‌ రాయ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో జార్ఖండ్‌ 17.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసి గెలుపొందింది. 

కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ (50 బంతుల్లో 113 నాటౌట్‌; 10 ఫోర్లు, 8 సిక్స్‌లు) అజేయ శతకంతో చెలరేగాడు. విరాట్‌ సింగ్‌ (40 బంతుల్లో 53 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీతో అతడికి అండగా నిలిచాడు. 

ఫలితంగా జార్ఖండ్‌ 8 వికెట్ల తేడాతో త్రిపురను చిత్తు చేసి గెలుపు నమోదు చేసింది. సెంచరీతో కదం తొక్కిన ఇషాన్‌ కిషన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

చరిత్ర సృష్టించిన ఇషాన్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
టీ20 ఫార్మాట్లో కెప్టెన్‌గా, వికెట్‌ కీపర్‌గా వ్యవహరిస్తూ ఇషాన్‌ కిషన్‌ సాధించిన మూడో సెంచరీ ఇది. తద్వారా  క్రికెట్‌ ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా ఈ చోటా డైనమైట్‌ నిలిచాడు.

గతంలో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ (SMAT) 2018-19 సీజన్‌లో జార్ఖండ్‌ సారథిగా, వికెట్‌ కీపర్‌గా ఉంటూ రెండు శతకాలు బాదాడు ఇషాన్‌. అంతకు ముందు ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్‌క్రిస్ట్‌ టీ20 ఫార్మాట్లో మిడిల్‌స్సెక్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ (పంజాబ్‌ కింగ్స్‌) కెప్టెన్‌గా, వికెట్‌ కీపర్‌గా ఉంటూ రెండు సెంచరీలు చేశాడు.

టీ20 క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో కెప్టెన్‌గా, వికెట్‌ కీపర్‌గా ఉంటూ అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు
🏏ఇషాన్‌ కిషన్‌ (ఇండియా)- జార్ఖండ్‌ తరఫున 3 శతకాలు
🏏ఆడం గిల్‌క్రిస్ట్‌ (ఆస్ట్రేలియా)- మిడిల్‌స్సెక్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ తరఫున కలిని 2 శతకాలు
🏏మొహమ్మద్‌ రిజ్వాన్‌ (పాకిస్తాన్‌)- ముల్తాన్‌ సుల్తాన్స్‌ తరఫున 2 శతకాలు.  

చదవండి: నాకు 37 ఏళ్లు.. అప్పటి వరకు ఆడుతూనే ఉంటా: కుండబద్దలు కొట్టిన కోహ్లి

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)