ఇషాన్‌ కెరీర్‌ బెస్ట్‌.. శాంసన్‌ అదరహో

Published on Wed, 03/11/2026 - 15:14

భారత ఆటగాళ్ల సమిష్టి కృషితో టీ20 ప్రపంచకప్‌ నెగ్గిన టీమిండియా తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టింది. బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్లు సత్తా చాటారు. భారత విధ్వంసక ఆల్‌రౌండర్‌ అభిషేక్‌ శర్మ (875 పాయింట్లు) తొలి స్థానాన్ని కాపాడుకున్నాడు. ఇక టీ20 ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌ల్లో 317 పరుగులతో భారత్‌ తరఫున రెండో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన ఇషాన్‌ కిషన్‌ రెండు స్థానాలు మెరుగుపరుచుకొని 871 పాయింట్లతో రెండో ర్యాంకులో నిలిచి కెరీర్‌ బెస్ట్‌ సాధించాడు. 

మిగతా బ్యాటర్లలో తిలక్‌ వర్మ ఒక స్థానం దిగజారి 742 పాయింట్లతో ఏడో స్థానంలో నిలవగా.. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ రెండు స్థానాలు దిగజారి 722 పాయింట్లతో 9వ స్థానంలో ఉన్నాడు. ఇక టీ20 ప్రపంచకప్‌ హీరో సంజూ శాంసన్‌ ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 637 పాయింట్లతో 22వ స్థానంలో నిలిచి తన కెరీర్‌లో బెస్ట్‌ ర్యాంకును అందుకున్నాడు. ఓవరాల్‌గా టాప్‌-10లో నలుగురు భారత బ్యాటర్లు చోటు దక్కించుకోవడం విశేషం. 

బౌలింగ్‌ విభాగంలో అఫ్గానిస్థాన్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ ఒక స్థానం ఎగబాకి 753 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక టీమిండియా మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ఒక స్థానం దిగజారి 740 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా, పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఒక స్థానం ఎగబాకి 702 పాయింట్లతో ఆరో స్థానం దక్కించుకున్నాడు. మిగతా టీమిండియా బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌ మూడు స్థానాలు దిగజారి 16వ స్థానంలో, అక్షర్‌ పటేల్‌ ఏకంగా ఆరు స్థానాలు ఎగబాకి 17వ స్థానానికి చేరుకున్నాడు. 

ఆల్‌రౌండర్ల విభాగానికి వస్తే జింబాబ్వే ఆల్‌రౌండర్‌ సికందర్‌ రజా, భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలవగా, శివమ్‌ దూబే మాత్రం రెండు స్థానాలు దిగజారి 11వ స్థానానికి పడిపోయాడు.

చదవండి: టీమిండియా సిగ్గుపడు!.. మాజీ క్రికెటర్‌కు ఇచ్చిపడేసిన గంభీర్‌

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)