అప్పుడు బీసీసీఐ నిషేధం!.. ఇప్పుడీ కుర్రాడికి ‘సలామ్‌’​ కొట్టాల్సిందే!

Published on Mon, 06/01/2026 - 11:07

‘ఈ సాలా కప్‌ నమ్‌దూ’ అంటూ పద్దెనిమిదేళ్లుగా ఎదురుచూసిన అభిమానుల కలను రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) గతేడాది నిజం చేసింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి ఐపీఎల్‌ ట్రోఫీని ముద్దాడింది. అయితే, అంతటితో ఆర్సీబీ ఆకలి తీరలేదు.

ఆత్మ విశ్వాసంతో ఐపీఎల్‌-2026లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగి అద్భుత ప్రదర్శనతో మరోసారి టైటిల్‌ విజేతగా అవతరించింది. అహ్మదాబాద్‌లో ఆదివారం నాటి ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించి వరుసగా రెండోసారి ట్రోఫీ గెలిచి.. ‘ఈ సాలనూ కప్‌ నమ్‌దూ’ (ఈసారీ కప్పు మనదే) అంటూ విజిల్స్‌ వేయించింది.

చివరి నిమిషంలో సువర్ణావకాశం
నిజానికి ఆర్సీబీ అ‘ద్వితీయ’విజయంలో పేస్‌ బౌలింగ్‌ దళానిదే కీలక పాత్ర. టీమిండియా వెటరన్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ (28 వికెట్లు), ఆస్ట్రేలియా స్టార్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ (15 వికెట్లు) ముందుండి నడిపించగా... మరో భారత కుర్రాడి పాత్ర కూడా మరువలేనిది. 

గతేడాది సత్తా చాటినా.. వివాదం కారణంగా చివరి నిమిషంలో యశ్‌ దయాళ్‌ దూరం కావడంతో మూడో పేసర్‌గా సత్తా చాటాల్సిన స్థితిలో తనకు లభించిన అవకాశాన్ని అతడు సమర్థంగా వినియోగించుకున్నాడు.

అతడు మరెవరో కాదు జమ్ము కశ్మీర్‌కు చెందిన 26 ఏళ్ల రసిఖ్‌ సలామ్‌. ఈ సీజన్‌లో 19 వికెట్లతో రాణించి.. తన కెరీర్‌లోనే చిరస్మరణీయ విజయంలో భాగమయ్యాడు. అనూహ్య మలుపులతో సాగిన కెరీర్‌లో అతడు ఇక్కడి వరకు రాగలిగాడు.

రెండేళ్ల నిషేధం విధించిన బీసీసీఐ!
ఐపీఎల్‌లో 2019లో తొలిసారి ముంబై ఇండియన్స్‌ తరఫున ఒకే ఒక మ్యాచ్‌ ఆడి సలామ్‌ అరంగేట్రం చేశాడు. కొద్ది రోజుల్లోనే ‘తప్పుడు వయసు’ను చూపించిన కారణంగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అతడిపై రెండేళ్ల నిషేధం విధించింది. దీంతో 2020 అండర్‌–19 వరల్డ్‌ కప్‌ ఆడే అవకాశం కోల్పోయాడు సలామ​.

ముంబై అండతో..
అయితే ముంబై ఇండియన్స్‌ అండగా నిలిచి అన్ని సౌకర్యాలతో తమ ప్రైవేట్‌ క్లబ్‌లో అతడికి రెండేళ్ల పాటు ప్రాక్టీస్‌ చేసే అవకాశాన్ని కల్పించింది. ఈ క్రమంలో 2022లో మళ్లీ ఐపీఎల్‌ అవకాశం దక్కగా కేకేఆర్‌ 2 మ్యాచ్‌లే ఆడించింది. 

ఇక 2023లో సలామ్‌ గాయంతో ఆటకు దూరమయ్యాడు. కారు ప్రమాదం నుంచి కోలుకొని జాతీయ క్రికెట్‌ అకాడమీలో సాధన చేస్తున్న రిషభ్‌ పంత్‌... సలామ్‌ బౌలింగ్‌ పదును చూసి ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌లో అవకాశం కల్పించాడు.

రసిఖ్‌ అంటే ‘నిలకడ’ 
అలా 2024లో 8 మ్యాచ్‌లు ఆడే చాన్స్‌ లభించడంతో సలామ్‌ ఆకట్టుకున్నాడు. ఇక గతేడాది ఆర్సీబీ రూ.6 కోట్లకు అతడిని తీసుకున్నప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలో రెండు మ్యాచ్‌లలోనే అవకాశం దక్కింది కానీ జట్టు అతడిలో మంచి భవిష్యత్తును చూసింది. దాని ఫలితం ఈ సారి కనిపించింది. కశ్మీరీ భాషలో రసిఖ్‌ అంటే ‘నిలకడ’ అని అర్థం.

ఈసారి 12 మ్యాచ్‌లలో నిలకడగా రాణించిన సలామ్‌ కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టు నమ్మకాన్ని నిలబెట్టి.. జట్టులో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. 

గుజరాత్‌ టైటాన్స్‌తో ఫైనల్లో సీనియర్లు భువీ, హాజిల్‌వుడ్‌ కంటే.. సలామ్‌ మంచి ఎకానమీతో బౌలింగ్‌ చేశాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 27 పరుగులే ఇచ్చి.. నిశాంత్‌ సింధు (20), రాహుల్‌ తెవాటియా (7), రషీద్‌ ఖాన్‌ (7) రూపంలో మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు.‌ 

చదవండి: వైభవ్‌ తగ్గేదేలే!.. ఎవరికెంత ప్రైజ్‌ మనీ అంటే?!

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)