Breaking News

IPL 2026: జింబాబ్వే బౌలర్‌కు బంపరాఫర్‌?

Published on Fri, 03/13/2026 - 17:47

ఐపీఎల్‌-2026 సీజన్‌ మరో రెండు వారాల్లో షురూ కానుంది. ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫ్రాంచైజీ పేసర్‌ ముస్తాఫిజుర్‌ రెహ్మన్‌ స్ధానాన్ని భర్తీ చేసే పనిలో పడింది. అతడి స్దానంలో జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీని తీసుకోవాలని కేకేఆర్ భావిస్తున్నట్లు సమాచారం.

ముజరబానీ ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. జింబాబ్వే సూపర్‌-8 స్టేజ్‌కు చేరుకోవడంలో ఈ రైట్‌ ఆర్మ్ పేసర్‌ది కీలక పాత్ర. ఆస్ట్రేలియాతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ముజరబానీ నాలుగు వికెట్లు పడగొట్టి జింబాబ్వేకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.

అతడికి పవర్‌ప్లేతో డెత్‌ ఓవర్లలో కూడా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసే సత్తా ఉంది. ఈ క్రమంలోనే అతడిని తమ జట్టులోకి తీసుకునేందుకు కేకేఆర్‌ సిద్దమైనట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ముజరబానీ ఇప్పటివరకు ఐపీఎల్‌లో అరంగేట్రం చేయలేదు. గత సీజన్‌ ఆఖరిలో ఆర్సీబీ జట్టులోకి వచ్చినప్పటికి.. తుది జట్టులో మాత్రం అవకాశం దక్కలేదు.

ముస్తాఫిజుర్‌పై వేటు..
కాగా గతేడాది జరిగిన మినీ వేలంలో ముస్తాఫిజుర్‌ రెహ్మన్‌ను రూ.9.20 కోట్ల భారీ ధరకు కేకేఆర్‌ కొనుగోలు చేసింది. కానీ వేలం అనంతరం బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగిపోవడంతో ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌ నుంచి తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. దీంతో బీసీసీఐ అతడిని జట్టు నుంచి రిలీజ్‌ చేయాలని కేకేఆర్‌ సూచింది.

బీసీసీఐ ఆదేశాల మేరకు ముస్తాఫిజుర్‌ను కేకేఆర్‌ విడుదల చేసింది. అయితే ఈ ఏడాది సీజన్‌ ఆరంభానికి ముందే కేకేఆర్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే రూ.18 కోట్ల భారీ ధర వెచ్చించి మరి కొనుగోలు చేసిన శ్రీలంక పేసర్‌ మతీషా పతిరానా, భారత ఆల్‌రౌండర్‌ హర్షిత్‌ రాణా గాయాలతో పోరాడుతున్నారు. వీరిద్దరి అందుబాటుపై ఇంకా స్పష్టత రాలేదు.

కేకేఆర్ పూర్తి జట్టు:
అజింక్యా రహానే, అంగ్క్రిష్ రఘువంశీ (కీపర్), అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, మనీష్ పాండే, రమణ్‌దీప్ సింగ్, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, సునీల్ నరైన్, ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కామెరాన్ గ్రీన్, మతీషా పతిరానా, తేజస్వి సింగ్, ఫిన్ అలెన్ (కీపర్), కార్తీక్ త్యాగి, ప్రశాంత్ సోలంకి, టిమ్ సీఫెర్ట్ (కీపర్), రాహుల్ త్రిపాఠి, దక్ష్ కమ్రా, రచిన్ రవీంద్ర, ఆకాష్ దీప్, సార్థక్ రంజన్.
చదవండి: భారత ఫ్రాంఛైజీలకు ఆడుతున్న పాక్‌ ఆటగాళ్ల లిస్టు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)