అయ్య‌ర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి సీఎస్‌కే ఔట్‌

Published on Wed, 04/30/2025 - 23:35

ఐపీఎల్‌-2025లో చెన్నై సూప‌ర్ కింగ్స్ క‌థ ముగిసింది. చెపాక్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన కీల‌క మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో సీఎస్‌కే ఓటమి పాలైంది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి చెన్నై నిష్క్ర‌మించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూప‌ర్ కింగ్స్ 19.2 ఓవ‌ర్ల‌లో 190 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

సీఎస్‌కే బ్యాట‌ర్ల‌లో  సామ్ కుర్రాన్‌(88) అద్బుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. అత‌డితో పాటు బ్రెవిస్(32) ప‌రుగుల‌తో రాణించాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో యుజ్వేంద్ర చాహ‌ల్ నాలుగు వికెట్ల‌తో చెల‌రేగాడు. ఈ మ్యాచ్‌లో చాహ‌ల్ హ్యాట్రిక్ వికెట్లు ప‌డ‌గొట్టాడు. చాహ‌ల్‌తో పాటు అర్ష్‌దీప్‌, జాన్సెన్ త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

అయ్య‌ర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌..
అనంత‌రం 191 ప‌రుగుల ల‌క్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 19.4 ఓవ‌ర్ల‌లో చేధించింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 72 ప‌రుగులు చేశాడు. అత‌డితో పాటు ప్ర‌భ్‌సిమ్రాన్ సింగ్‌(54) హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో ప‌తిరానా రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ర‌వీంద్ర జ‌డేజా, నూర్ అహ్మ‌ద్‌,ఖాలీల్ అహ్మ‌ద్ త‌లా వికెట్ సాధించారు.
చ‌ద‌వండి: IPL 2025: చరిత్ర సృష్టించిన చాహల్‌.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి ప్లేయర్‌గా
 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)