Breaking News

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్‌ పాయింట్‌' ఉంది.. అదేంటి..?

Published on Tue, 04/29/2025 - 15:20

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పటివరకు నలుగురు ఆటగాళ్లు సెంచరీలు చేశారు. ఈ నలుగురిలో ఓ కామన్‌ పాయింట్‌ ఉంది. అదేంటంటే.. నలుగురు లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్లే. పైగా నలుగురు 27 ఏళ్ల లోపు వారే. ఈ నలుగురు 45 బంతుల్లోపే సెంచరీలు పూర్తి చేశారు. వీరిలో ఇద్దరు సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు కాగా.. ఒకరు పంజాబ్‌, ఒకరు రాజస్థాన్‌ ఆటగాడు.

ఈ సీజన్‌లో తొలి సెంచరీని సన్‌రైజర్స్‌ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ చేశాడు. సీజన్‌ రెండో మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై ఇషాన్‌ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన ఇషాన్‌, మొత్తంగా 47 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐపీఎల్‌లో ఇషాన్‌ చేసిన ఈ సెంచరీ 15వ వేగవంతమైన సెంచరీ.

ఈ సీజన్‌లో రెండో సెంచరీని పంజాబ్‌ ఆటగాడు ప్రియాంశ్‌ ఆర్య చేశాడు. సీజన్‌ 22వ మ్యాచ్‌లో సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ప్రియాంశ్‌ మూడంకెల స్కోర్‌ను సాధించాడు. ఈ మ్యాచ్‌లో ప్రియాంశ్‌ 42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేశాడు.

ప్రియాంశ్‌ ఈ సెంచరీని కేవలం​ 39 బంతుల్లో పూర్తి చేశాడు. ఐపీఎల్‌లో ఇది ఆరో వేగవంతమైన సెంచరీ. ప్రియాంశ్‌ ఈ రికార్డును సన్‌రైజర్స్‌ ఆటగాడు ట్రవిస్‌ హెడ్‌తో షేర్‌ చేసుకున్నాడు. ట్రవిస్‌ కూడా గత సీజన్‌లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లో శతక్కొట్టాడు.

ఈ సీజన్‌లో మూడో సెంచరీని సన్‌రైజర్స్‌ ఆటగాడు అభిషేక్‌ శర్మ చేశాడు. సీజన్‌ 27వ మ్యాచ్‌లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్‌ కేవలం 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో 55 బంతులు ఎదుర్కొన్న అభిషేక్‌ 14 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 141 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అభిషేక్‌ది ఏడో వేగవంతమైన సెంచరీ.

ఈ సీజన్‌లో నాలుగో సెంచరీని రాజస్థాన్‌ ఆటగాడు వైభవ్‌ సూర్యవంశీ చేశాడు. సీజన్‌ 47వ మ్యాచ్‌లో వైభవ్‌ గుజరాత్‌ టైటాన్స్‌పై ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం​ 35 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన వైభవ్‌.. మొత్తంగా 38 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ఇది రెండో వేగవంతమైన సెంచరీ. ఐపీఎల్‌లో ఫాస్టెస్‌ సెంచరీ రికార్డు క్రిస్‌ గేల్‌ (30 బంతుల్లో) పేరిట ఉంది.

వైభవ్‌ ఈ సెంచరీ చేసే సమయానికి అతని వయసు కేవలం​ 14 ఏళ్ల 32 రోజులు. ఈ సెంచరీతో వైభవ్‌ చాలా రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సీజన్‌లో సెంచరీలు చేసిన నలుగురిలో వైభవ్‌ అత్యంత పిన్న వయస్కుడు.

 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)