Breaking News

IPL 2024: అ‍న్నంత పని చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ఆ ముగ్గురిని వదిలించుకుంది

Published on Sun, 11/26/2023 - 16:58

ఐపీఎల్‌ 2024కి సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్‌ (నిలబెట్టుకోవడం), రిలీజ్‌ (వదిలించుకోవడం) ప్రక్రియకు ఇవాళ (నవంబర్‌ 26) ఆఖరి తేదీ కావడంతో అన్ని ఫ్రాంచైజీలు  తాము నిలబెట్టుకునే ఆటగాళ్ల జాబితాను, వదిలించుకునే ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. అన్ని ఫ్రాంచైజీల కంటే ముందుగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ తాము వదిలించుకోబోయే ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది.

ముందుగా అనుకున్న ప్రకారం సీఎస్‌కే ముగ్గురు స్టార్‌ ఆటగాళ్లకు అల్విదా చెప్పింది. కోట్లు కుమ్మరించి కొనుక్కున్న బెన్‌ స్టోక్స్‌ (16.25 కోట్లు), అంబటి రాయుడు (6.75), కైల్‌ జేమీసన్‌ను (1 కోటి) వివిధ కారణాల చేత రిలీజ్‌ చేసింది. వీరితో పాటు సీఎస్‌కే మరో ఐదుగురికి కూడా గుడ్‌బై చెప్పింది. విదేశీ ఆటగాళ్లు డ్వేన్‌ ప్రిటోరియస్‌ (50 లక్షలు), సిసండ మగాల (50 లక్షలు)తో పాటు లోకల్‌ ప్లేయర్స్‌ ఆకాశ్‌ సింగ్‌ (20 లక్షలు), భగత్‌ వర్మ (20 లక్షలు), సుభ్రాన్షు సేనాపతిలను (20 లక్షలు) సీఎస్‌కే రిలీజ్‌ చేసింది.

ఈ ఎనిమిది మందిని రిలీజ్‌ చేశాక సీఎస్‌కే పర్స్‌లో 32.2 కోట్లు మిగిలాయి. ప్రస్తుతం ఆ జట్టుకు ఆరుగురిని కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. ఇందులో ముగ్గురు విదేశీ ఆటగాళ్లను తీసుకోవచ్చు. 

కెప్టెన్‌గా మళ్లీ ధోనినే..
చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్‌ ధోనిని రికార్డు స్థాయిలో 15వ సారి తమ కెప్టెన్‌గా ఎంపిక  చేసింది. రిలీజ్‌ చేసే ఆటగాళ్ల జాబితాతో పాటు తాము నిలబెట్టుకునే ఆటగాళ్ల జాబితాను కూడా ప్రకటించిన సీఎస్‌కే ముందుగా ధోని పేరును ప్రకటించి, అతడే 2024 సీజన్‌కు కూడా మా కెప్టెన్‌ అని స్పష్టం చేసింది. ధోని ఐపీఎల్‌ మొదలైనప్పటి (2008) నుంచి (మధ్యలో 2016, 2017 సంవత్సరాలు మినహా) సీఎస్‌కే కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. 

చెన్నై సూపర్‌ కింగ్స్‌ రిలీజ్‌ చేసిన ఆటగాళ్లు వీరే.. 

  • బెన్‌ స్టోక్స్‌ (16.25 కోట్లు)
  • అంబటి రాయుడు (6.75 కోట్లు)
  • కైల్‌ జేమీసన్‌ (కోటి)
  • డ్వేన్‌ ప్రిటోరియస్‌ (50 లక్షలు)
  • సిసండ మగాల (50 లక్షలు)
  • ఆకాశ్‌ సింగ్‌ (20 లక్షలు)
  • భగత్‌ వర్మ (20 లక్షలు)
  • సుభ్రాన్షు సేనాపతి (20 లక్షలు)

సీఎస్‌కే రీటైన్‌ చేసుకున్న ఆటగాళ్లు వీరే..
ఎంఎస్‌ ధోని (కెప్టెన్‌), డెవాన్‌ కాన్వే, రుతురాజ్‌ గైక్వాడ్‌, అజింక్య రహానే, షేక్‌ రషీద్‌, రవీంద్ర జడేజా, మిచెల్‌ సాంట్నర్‌, మొయిన్‌ అలీ, శివమ్‌ దూబే, నిషాంత్‌ సింధు, అజయ్‌ మండల్‌, రాజ్‌వర్ధన్‌ హంగార్గేకర్‌, దీపక్‌ చాహర్‌, మహీష తీక్షణ, ముకేశ్‌ చౌదరీ, ప్రశాంత్‌ సోలం​కి, సిమ్రన్‌జీత్‌ సింగ్‌, తుషార్‌దేశ్‌ పాండే, మతీశ పతిరణ
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)