నువ్వేమీ ముసలోడివి కాలేదు!; సచిన్‌లా 16 ఏళ్లకే ఆట మొదలెడితే: ధోని

Published on Sat, 04/22/2023 - 12:29

IPL 2023 CSK Vs SRH- Dhoni- Harsha Bhogle: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని స్టన్నింగ్‌ క్యాచ్‌తో మెరిశాడు. మహీశ్‌ తీక్షణ బౌలింగ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్కరమ్‌ను ఇచ్చిన క్యాచ్‌ను ఒడిసిపట్టి కీలక వికెట్‌లో భాగస్వామ్యమయ్యాడు. మ్యాచ్‌ అనంతరం ఈ విషయం గురించి కామెంటేటర్‌ హర్షా బోగ్లే ప్రస్తావించగా  వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ద్రవిడ్‌ సైతం ఇలాగే
అలాంటి క్యాచ్‌లు అందుకోవడం అంత సులువేమీ కాదు కదా అని హర్ష పేర్కొనగా.. ‘‘నిజానికి అప్పుడు నేను సరైన పొజిషన్‌లో లేను. మేము గ్లౌవ్స్‌ వేసుకుంటాం కాబట్టి.. కొంతమందికి మేము తేలికగానే క్యాచ్‌ పట్టేస్తామని అనిపిస్తుంది. 

ఈ రోజు నేను అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాను. కొన్నిసార్లు మన శక్తిసామర్థ్యాలు, నైపుణ్యాలతో సంబంధం లేకుండా.. అనుకోకుండా ఇలా జరిగిపోతుంది. నాకింకా గుర్తే.. ఓ మ్యాచ్‌లో రాహుల్‌ ద్రవిడ్‌ సైతం ఇలాంటి క్యాచ్‌నే అందుకున్నాడు’’ అని ధోని పేర్కొన్నాడు.

నువ్వేమీ ముసలోడివి కాలేదు
అదే విధంగా.. ‘‘వయసు పైబడుతున్న కొద్దీ.. అనుభవం కూడా పెరుగుతుంది. సచిన్‌ టెండుల్కర్‌లా 16-17 ఏళ్లకే క్రికెట్‌ ఆడటం మొదలుపెడితే విషయం వేరేలా ఉంటుంది. ఆటను మరింతగా ఎంజాయ్‌ చేసే అవకాశం ఉంటుంది’’ అని ధోని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో హర్షా స్పందిస్తూ.. ‘‘నీకేమీ వయసు మీదపడలేదు(నువ్వేమీ ముసలోడికి కాలేదింకా)’’ అని సరదాగా కామెంట్‌ చేశాడు

వయసు పైబడింది.. నేనేమీ సిగ్గుపడను
దీంతో.. ‘‘లేదు లేదు! కచ్చితంగా నాకు వయసు పైబడుతోంది. ఈ విషయాన్ని చెప్పుకోవడానికి నేనేమీ సిగ్గుపడను’’ అంటూ 41 ఏళ్ల ధోని అంతే ఫన్నీగా బదులిచ్చాడు. ఇక అద్భుతమైన క్యాచ్‌ పట్టినా తనకు అవార్డు ఇవ్వలేదంటూ ఐపీఎల్‌ నిర్వాహకులను ఉద్దేశించి ధోని సరదాగా కామెంట్‌ చేశాడు.

రుతుకు అవార్డు.. నాకు మాత్రం ఇవ్వలేదు
కాగా చెపాక్‌ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 7 వికెట్ల తేడాతో రైజర్స్‌పై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ధోని సంచలన క్యాచ్‌ అందుకోవడంతో పాటు.. మయాంక్‌ అగర్వాల్‌ను స్టంపౌట్‌, వాషింగ్టన్‌ సుందర్‌ను రనౌట్‌ చేశాడు.  ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో యాక్టివ్‌ క్యాచ్‌ అవార్డును చెన్నై ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ అందుకున్నాడు. తీక్షణ బౌలింగ్‌లో క్లాసెన్‌ ఇచ్చిన క్యాచ్‌ అద్భుత రీతిలో అందుకుని అవార్డు గెలుచుకున్నాడు.

చదవండి: Dhoni: నాకూ కూతురు ఉంది.. మరి అక్క ఏది? తంబీ లేడా?.. తప్పు చేశావు కుట్టీ!
CSK VS SRH: ఎట్టకేలకు 28 మ్యాచ్‌ల తర్వాత రిపీటైంది..! 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)