Breaking News

రిషబ్‌ పంత్‌ వచ్చేశాడు.. ఫోటోలు వైరల్‌

Published on Tue, 04/04/2023 - 21:03

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. హోంగ్రౌండ్‌ అయిన అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ఆడుతున్న మ్యాచ్‌కు రిషబ్‌ పంత్‌ హాజరయ్యాడు. ఫిజియో సాయంతో మ్యాచ్‌కు హాజరైన పంత్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ బయట కూర్చొని మ్యాచ్‌ వీక్షించాడు. పంత్‌ను చూసిన అభిమానులు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు.  మిస్‌ యూ పంత్‌.. RP 17 అంటూ బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు.

షార్ట్‌. వైట్‌ టీషర్ట్‌ వేసుకున్న పంత్‌ కర్ర సాయంతోనే మ్యాచ్‌కు వచ్చాడు. అభిమానులకు అభివాదం చేసిన పంత్‌ ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ డగౌట్‌ వైపు చిరునవ్వుతో ఇచ్చిన లుక్స్‌ ఆకట్టుకున్నాయి. పంత్‌ రాకను మానిటర్‌లో గమనించిన సౌరవ్‌ గంగూలీ, హెడ్‌కోచ్‌ పాంటింగ్‌ సహా ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

గతేడాది డిసెంబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన పంత్‌ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం కోలుకుంటున్న పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ మిస్‌ అవుతున్నట్లు ఇప్పటికే చాలాసార్లు పేర్కొంది. సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆడిన తొలి మ్యాచ్‌కు డగౌట్‌లో పంత్‌ జెర్సీని డగౌట్‌లో ప్రదర్శించింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇలా చేయడంపై బీసీసీఐ సీరియస్‌ అయింది.

భౌతికంగా దూరమైనవారికే మాత్రమే అలాంటి గౌరవం ఇస్తారని.. పంత్‌ మనతోనే ఉన్నాడని.. ఇలాంటివి రిపీట్‌ చేయొద్దని హెచ్చరించింది. బీసీసీఐకి క్షమాపణ చెప్పిన ఢిల్లీ ఫ్రాంచైజీ ముందునుంచి చెప్పినట్లుగా పంత్‌ను స్టేడియానికి తీసుకొచ్చింది. మ్యాచ్‌లు ఆడకపోయినా పంత్‌ తమతో ఉంటే మాకు ధైరంగా ఉంటుందని పాంటింగ్‌ కూడా తెలిపాడు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)