TDP నేత సంచలన ఆడియో.. తిరుపతి ఇంచార్జి మంత్రి జల్సాలు.. లాడ్జీల్లో సరసాలు..
Breaking News
ఆర్సీబీకి ప్లేఆఫ్ అవకాశం ఎంత?.. కోహ్లిపై డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు
Published on Sat, 05/14/2022 - 10:50
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ మరొక పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్లేఆఫ్‌కు దగ్గరైన వేళ పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో ఓటమిపాలై అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. పంజాబ్ భారీ స్కోరు చేసినప్పటికి ఆర్‌సీబీ అసలు పోరాడే ప్రయత్నమే చేయలేదు. మరి ఆర్‌సీబీకి ప్లే ఆఫ్ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి. ఆర్‌సీబీ ప్లే ఆఫ్ చేరాలంటే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. గుజరాత్ టైటాన్స్‌తో ఆఖరి మ్యాచ్ ఆడనున్న ఆర్‌సీబీ ఒకవేళ ఓడితే మాత్రం ఇంటిదారి పట్టాల్సిందే.
ప్రస్తుతం ఆర్సీబీ 13 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు, ఆరు పరాజయాలతో 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. దీనికి తోడు ఆర్‌సీబీ నెట్‌రన్‌రేట్ కూడా మైనస్‌లో ఉంది. గుజరాత్‌తో మ్యాచ్ గెలిస్తే.. 16 పాయింట్లతో ప్లేఆఫ్ అవకాశాలు ఉంటాయి. ఒక రకంగా ఆర్సీబీకి గుజరాత్‌తో మ్యాచ్ డూ ఆర్ డై అనొచ్చు. ఆర్‌సీబీ ఓడినా కూడా ఒక అవకాశం ఉంది. ప్లే ఆఫ్‌లో తొలి రెండు స్థానాలు గుజరాత్, లక్నోలు దాదాపు ఖరారు చేసుకున్నట్లే.
ఇక మూడో జట్టుగా రాజస్తాన్ రాయల్స్‌కు అవకావం ఉన్నప్పటికి.. మూడు, నాలుగు స్థానాలకు ఎక్కువ జట్లు పోటీ పడుతున్నాయి. వాటిలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ ప్లస్ నెట్ రన్‌రేట్‌తో ముందంజలో ఉన్నాయి. ఒకవేళ పంజాబ్ లేదా ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఏ జట్టైనా తమ చివరి రెండు మ్యాచ్‌లు గెలిస్తే ఆర్‌సీబీ కథ ముగిసినట్లే. మరి ఆర్‌సీబీ తమ చివరి మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలు నిలుపుకుంటుందా లేక మరోసారి లీగ్ దశలోనే ఇంటిబాట పడుతుందా అనేది రానున్న రోజుల్లో తెలియనుంది.
ఇదిలా ఉంటే.. మ్యాచ్ ఓటమి అనంతరం ఆర్‌సీబీ కెప్టెన్ డుప్లెసిస్ కోహ్లి బ్యాడ్ ఫామ్‌పై స్పందించాడు. ''కోహ్లికి నా మద్దతు ఉంటుంది. అతను బ్యాడ్‌ఫేజ్ చూస్తున్న మాట నిజమే.. కానీ అతని కోసం ఒక మంచి ఇన్నింగ్స్ ఎదురుచూస్తుంది.. దానిని అందుకుంటానని కోహ్లి గట్టిగా నమ్ముతున్నాడు. కోహ్లి తేలికైన ఆటను ఆడేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తున్నాడు.. కానీ అన్ని మార్గాలు అతని ఔట్ కోసం వచ్చేస్తున్నాయి. ఒక గేమ్‌లో ఇలా జరగడం సహజం. ఏదైనా సరే.. పాజిటివ్‌గా ఉంటూ కష్టపడితే ఫలితం కనిపిస్తుంది. వాస్తవానికి ఈరోజు మ్యాచ్‌లో కోహ్లి కొన్ని మంచి షాట్లు ఆడాడు. ఇలాంటి ఆటను మున్ముందు కూడా ఆడుతూ భారీ స్కోర్లు చేయాలని కోరుకుంటున్నా..'' అంటూ తెలిపాడు.
చదవండి: Virat Kohli: అలవాటే కదా.. ఎవరిని తిట్టి ఏం లాభం!
IPL 2022: దీని దుంపతెగ.. పాడు పిల్లి ఎంత పనిచేసింది
A clinical win for @PunjabKingsIPL! 👏 👏
— IndianPremierLeague (@IPL) May 13, 2022
6⃣th victory of the season for @mayankcricket & Co. as they beat #RCB by 54 runs. 👍 👍
Scorecard ▶️ https://t.co/jJzEACTIT1#TATAIPL | #RCBvPBKS pic.twitter.com/Zo7TJvRTFa
Tags : 1