Breaking News

GT VS RR: బట్లర్‌ గిట్లర్‌ జాన్తానై.. మహ్మద్‌ షమీ ఆసక్తికర కామెంట్లు..!

Published on Tue, 05/24/2022 - 13:03

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇవాళ (మే 24) తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌ జరుగనుంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గుజరాత్‌, రాజస్తాన్‌ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమరంలో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ కీలక మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో గుజరాత్‌ స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజస్తాన్‌ ఇన్‌ ఫామ్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ను కట్టడి చేసే విషయంలో తన గేమ్‌ ప్లాన్‌ ఎలా ఉండబోతుందో వివరిస్తూ.. తాను రికార్డులను, ఫామ్‌ను చూసి బయపడే టైప్‌ కాదని వ్యాఖ్యానించాడు. 

మనకు మనపై, మన నైపుణ్యంపై నమ్మకం ఉండాలే కానీ పేర్లను చూసి ఎప్పుడూ బయపడకూడదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. బ్యాటర్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడని, భారీ షాట్లు ఆడతాడని బౌలర్‌ ఎప్పుడూ ఆలోచించకూడదని.. ప్రతి ఒక్కరికి ఓ బలహీనత ఉంటుందని, దాన్ని క్యాష్‌ చేసుకుని వ్యూహాలు రచించాలని అన్నాడు. బట్లర్‌ జోరుకు అడ్డుకట్ట వేసేందుకు తమ ప్లాన్లు తమకున్నాయని తెలిపాడు. ఇదే సందర్భంగా షమీ తన వ్యక్తిగత ప్రదర్శనపై ఆనందం వ్యక్తం చేశాడు. గత కొన్ని మ్యాచ్‌ల్లో కాస్త స్లో అయినప్పటికీ.. ప్లే ఆఫ్ మ్యాచ్‌లో సత్తా చాటుతానని ధీమా వ్యక్తం చేశాడు.

కాగా, ప్రస్తుత సీజన్‌లో మహ్మద్‌ షమీ గుజరాత్‌ లీడింగ్‌ వికెట్‌ టేకింగ్‌ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అతను ఇప్పటి వరకు ఆడిన 14 మ్యాచ్‌ల్లో 17 స్ట్రయిక్‌ రేట్‌తో 8 కంటే తక్కువ ఎకానమీతో 18 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు లైఫ్‌ టైమ్‌ ఫామ్‌లో జోస్‌ బట్లర్‌.. ప్రస్తుత సీజన్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. అతను ఇప్పటివరకు ఆడిన 14 మ్యాచ్‌ల్లో 48.38 సగటున 146.96 స్ట్రయిక్‌ రేట్‌తో 629 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
చదవండి: వర్షం పడితే కథేంటి.. ఫైనల్‌ చేరే దారులు ఎలా ఉన్నాయంటే!

Videos

అల్లు అర్జున్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ..?

నేను నిప్పు, తెరిచిన పుస్తకం అన్నావ్ గా.. మరీ ఈ సీక్రెట్ టూర్ లు ఏంటి?

ఫ్రెండ్స్ తో పందెం కట్టి.. పెన్ను మింగేశాడు

ఈ వయసులో నీకు బుద్ధి లేదా.. MLA బుచ్చయ్య చౌదరిపై రెచ్చిపోయిన చెల్లుబోయిన

స్విట్జర్లాండ్ లో పెను విషాదం.. 40 మంది మృతి ..100 మందికి గాయాలు

చంద్రబాబు మీద ఉన్న ప్రతి కేసు రీ ఓపెన్!

బుజ్జితల్లి టాలీవుడ్ కు వచ్చేస్తుందా..

ప్రేమపెళ్లి చేసుకున్న యువకుడిపై దాడి

800 KG కేక్ కట్టింగ్.. జగన్ ఆశీస్సులతో మనదే విజయం

జగన్ వార్నింగ్ తో చంద్రబాబు సెల్ఫ్ గోల్..

Photos

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

‘ఈషా’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

లంగా ఓణీలో 'ఈషా రెబ్బా'.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన సినీ సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

హైటెక్ సిటీలో ఉత్సాహంగా న్యూ ఇయర్ వేడుకలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు (ఫొటోలు)

+5

హిమాలయాల్లో తిరిగేస్తున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

2025లో ఊహించనవి జరిగాయి.. కియారా అద్వానీ జ్ఞాపకాలు (ఫొటోలు)