Breaking News

నెట్స్‌లో రోహిత్‌ ప్రాక్టీస్‌.. టీమిండియా స్టార్‌కు గాయం

Published on Sat, 12/30/2023 - 18:43

South Africa Vs India 2nd Test: సౌతాఫ్రికాతో తొలి టెస్టులో చిత్తుగా ఓడిపోయిన టీమిండియా రెండో మ్యాచ్‌కు సన్నద్ధం అవుతోంది. లోపాలు సవరించుకుని ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు వీలుగా నెట్స్‌లో చెమటోడుస్తోంది. ముఖ్యంగా సెంచూరియన్‌ టెస్టులో ఓపెనర్‌గా విఫలమైన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరింత కఠినంగా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు.

హిట్‌మ్యాన్‌ కఠిన ప్రాక్టీస్‌
నెట్స్‌లో వైవిధ్యమైన బంతులు ఎదుర్కొంటూ కేప్‌టౌన్‌ టెస్టుకు పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే.. ప్రాక్టీస్‌ సందర్భంగా భారత పేస్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ గాయపడినట్లు సమాచారం. త్రోడౌన్స్‌ ఎదుర్కొంటూ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో అతడి భుజానికి గాయమైనట్లు తెలుస్తోంది.

షార్ట్‌ బాల్‌ను ఆడటంలో విఫలమైన శార్దూల్‌.. బంతి ఎడమ భుజానికి తాకడంతో నొప్పితో విలవిల్లాడగా.. ఫిజియో వచ్చి ఐస్‌ప్యాక్‌ పెట్టాడు. అయితే, నొప్పి నుంచి పూర్తిగా ఉపశమనం లభించకపోవడంతో అతడు మళ్లీ బౌలింగ్‌ ప్రాక్టీస్‌కు కూడా అందుబాటులో ఉండలేకపోయాడు.

పూర్తిగా విఫలమైన శార్దూల్‌.. యువ పేసర్‌ ఎంట్రీ!
ఒకవేళ నొప్పి తీవ్రతరమైతే అతడిని స్కానింగ్‌ పంపాలని వైద్య సిబ్బంది భావిస్తోంది. కాగా ఒకవేళ గాయం కారణంగా శార్దూల్‌ ఠాకూర్‌ రెండో టెస్టుకు దూరమైతే అతడి స్థానంలో ఆవేశ్‌ ఖాన్‌ లేదంటే ముకేశ్‌ కుమార్‌ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

అలా గాకుండా శార్దూల్‌ అందుబాటులో ఉన్నా కూడా మేనేజ్‌మెంట్‌ అతడిపై వేటు వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తొలి టెస్టులో ఆల్‌రౌండర్‌గా అతడి ప్రదర్శన దారుణంగా ఉండటమే ఇందుకు కారణం. సెంచూరియన్‌లో జరిగిన బాక్సింగ్‌ డే మ్యాచ్‌లో శార్దూల్‌ 19 ఓవర్ల బౌలింగ్‌లో ఏకంగా 100 పరుగులు ఇచ్చి పూర్తిగా నిరాశపరిచాడు.

ఇక బ్యాటర్‌గా తొలి ఇన్నింగ్స్‌లో 24 పరుగులతో పర్వాలేదనిపించిన శార్దూల్‌ ఠాకూర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం రెండు పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా- టీమిండియా మధ్య జనవరి 3 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. 

చదవండి: Future Legend: గిల్‌ సూపర్‌ టాలెంట్‌.. దిగ్గజ ఆటగాడిగా ఎదుగుతాడు! రచిన్‌ సైతం...

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)