అభిషేక్, దూబే మెరుపులు

Published on Thu, 07/02/2026 - 04:08

చెస్టర్‌ లీ స్ట్రీట్‌: ఇంగ్లండ్‌తో తొలి టి20 మ్యాచ్‌లో భారత బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన కనబర్చారు. ఐర్లాండ్‌ చేతిలో రెండు టి20ల్లోనూ ఓడి సిరీస్‌ కోల్పోయిన టీమ్‌... ఇంగ్లండ్‌తో పోరును సాధికారికంగా మొదలు పెట్టింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.

కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (47 బంతుల్లో 68; 6 ఫోర్లు, 1 సిక్స్‌), అభిషేక్‌ శర్మ (24 బంతుల్లో 59; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా...శివమ్‌ దూబే (21 బంతుల్లో 42 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) చివర్లో భారీ షాట్లు ఆడాడు. అభిషేక్, అయ్యర్‌ మూడో వికెట్‌కు 38 బంతుల్లో 82 పరుగులు జోడించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో సాఖిబ్‌ మహమూద్‌కు 3 వికెట్లు దక్కాయి. 

మ్యాచ్‌ రద్దు
ఇంగ్లండ్‌ ఛేదన సమయానికి భారీ వర్షం మొదలుకావడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. 

కీలక భాగస్వామ్యం... 
భారత తుది జట్టులో టీనేజర్‌ వైభవ్‌ సూర్యవంశీకి మరోసారి చోటు దక్కలేదు. సంజు సామ్సన్‌ (1) వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విఫలం కాగా, ఇషాన్‌ కిషన్‌ (0) మళ్లీ రనౌట్‌ కావడంతో 6 పరుగులకే భారత్‌ 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అభిషేక్, అయ్యర్‌ కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. అభిషేక్‌ తనదైన శైలిలో ధాటిగా చెలరేగగా, కెప్టెన్‌గా తొలి రెండు మ్యాచ్‌లలో విఫలమైన అయ్యర్‌ ఈ సారి జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేశాడు. డాసన్‌ ఓవర్లో సిక్స్‌ కొట్టిన అభిషేక్‌ మహమూద్‌ ఓవర్లో వరుసగా 4, 6, 6 బాదాడు. ల్యూక్‌వుడ్‌ ఓవర్లోనూ వరుసగా 3 ఫోర్లు కొట్టిన అతను 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

అభిషేక్‌ అవుటైన తర్వాత భారత్‌ జోరును నిలువరించడంలో ఇంగ్లండ్‌ బౌలర్లు సఫలమయ్యారు. 8 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 87/2 కాగా...తర్వాతి 6 ఓవర్లలో జట్టు 38 పరుగులే చేయగలిగింది. తిలక్‌వర్మ (13) ప్రభావం చూపలేకపోగా, 38 బంతుల్లో అయ్యర్‌ హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. అయ్యర్‌ వెనుదిరిగాక దూబే దూకుడుతో భారత్‌ మెరుగైన స్కోరుతో ముగించగలిగింది. రషీద్‌ బౌలింగ్‌లో అతను కొట్టిన 2 సిక్స్‌లు హైలైట్‌గా నిలిచాయి.

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌: సామ్సన్‌ (సి) బాంటన్‌ (బి) మహమూద్‌ 1; అభిషేక్‌ (ఎల్బీ) (బి) కరన్‌ 59; ఇషాన్‌ కిషన్‌ (రనౌట్‌) 0; అయ్యర్‌ (ఎల్బీ) (బి) మహమూద్‌ 68; తిలక్‌ (సి) డాసన్‌ (బి) మహమూద్‌ 13; దూబే (నాటౌట్‌) 42; హర్షిత్‌ (స్టంప్డ్‌) బట్లర్‌ (బి) రషీద్‌ 0; అక్షర్‌ (రనౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 189. వికెట్ల పతనం: 1–6, 2–6, 3–88, 4–124, 5–165, 6–174, 7–189. బౌలింగ్‌: ల్యూక్‌వుడ్‌ 3–0–35–0, మహమూద్‌ 4–0–33–3, డాసన్‌ 3–0–26–0, జాక్స్‌ 3–0–30–0, రషీద్‌ 4–0–39–1, స్యామ్‌ కరన్‌ 3–0–25–1.  

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)