Breaking News

పసిడి పతకం నెగ్గిన హిమాన్షు

Published on Sat, 04/19/2025 - 01:55

దమ్మామ్‌ (సౌదీ అరేబియా): ఆసియా అండర్‌–18 యూత్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించింది. శుక్రవారం జరిగిన పురుషుల జావెలిన్‌ త్రో ఈవెంట్‌లో హిమాన్షు భారత్‌కు పసిడి పతకాన్ని అందించాడు. 17 ఏళ్ల హిమాన్షు జావెలిన్‌ను 67.57 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు. లు హావో (చైనా; 63.45 మీటర్లు) రజతం... రుసియన్‌ సాదుల్లాయెవ్‌ (ఉజ్బెకిస్తాన్‌; 61.96 మీటర్లు) కాంస్యం సాధించారు.

హరియాణా మహిళా అథ్లెట్‌ ఆర్తి తన ఖాతాలో రెండో కాంస్య పతకాన్ని జమ చేసుకుంది. 200 మీటర్ల విభాగంలోనూ ఆర్తి కాంస్య పతకాన్ని సాధించింది. ఆర్తి 24.31 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. 100 మీటర్ల విభాగంలోనూ ఆర్తి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 

మరోవైపు పురుషుల హైజంప్‌లో దేవక్‌ భూషణ్‌ రజత పతకాన్ని గెల్చుకున్నాడు. భూషణ్‌ 2.03 మీటర్ల ఎత్తుకు ఎగిరి రెండో స్థానంలో నిలిచాడు. పురుషుల షాట్‌పుట్‌లో నిశ్చయ్‌ రజత పతకం దక్కించుకోగా... పురుషుల మెడ్లీ రిలేలో చిరంత్, సయ్యద్‌ సాబీర్, సాకేత్‌ మింజ్, కదీర్‌ ఖాన్‌లతో కూడిన భారత బృందం రజత పతకాన్ని హస్తగతం చేసుకుంది.    

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)