IND vs ZIM: వైభవ్‌ మెరుపులు.. టీమిండియా ఘన విజయం

Published on Thu, 07/23/2026 - 16:03

హ‌రారే వేదిక‌గా గురువారం నాటి తొలి టీ20లో భార‌త్-జింబాబ్వే జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. భారత్‌ లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌..  13.1  ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది.

ఓపెనర్లలో అభిషేక్‌ శర్మ (1) విఫలమైనప్పటికీ.. వైభవ్‌ సూర్యవంశీ మెరుపు అర్ద శతకంతో రాణించాడు. కేవలం 18 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, నాలుగు సిక్స్‌లు బాది 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అతడికి తోడుగా వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ (24 బంతుల్లో 35) రాణించగా.. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (28*), వైస్‌ కెప్టెన్‌ తిలక్‌ వర్మ (6*)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా 13.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి భారత్‌ 126 పరుగులు చేసింది. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Updates
10 ఓవర్లలో టీమిండియా స్కోరు: 96-2
ఇషాన్‌ 26, శ్రేయస్‌ అయ్యర్‌ 17 పరుగులతో ఉన్నారు.

వైభవ్‌ మెరుపు అర్ధ శతకం
6.1: నగరవ బౌలింగ్‌లో రెండు పరుగులు పూర్తి చేసుకుని యాభై పరుగుల మార్కు అందుకున్న వైభవ్‌. కేవలం 18 బంతుల్లోనే తొలి అంతర్జాతీయ హాఫ్‌ సెంచరీ. ఆ మరుసటి బంతికే అవుటయ్యాడు. స్కోరు: 68-2. ఇషాన్‌ 16 పరుగులతో ఉన్నాడు. శ్రేయస్‌ క్రీజులోకి వచ్చాడు.

భారత్‌ తొలి వికెట్‌ డౌన్‌
టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. ​కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన అభిషేక్‌ శర్మ.. ముజరబాని బౌలింగ్‌లో ఔటయ్యాడు. మరోవైపు చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ మాత్రం దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 9 బంతుల్లోనే 21 పరుగులు చేశాడు. 3 ఓవర్లకు భారత స్కోర్‌: 23/1 

టీమిండియా టార్గెట్‌ ఎంతంటే?
జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు సత్తాచాటారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. 

ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్‌లో మధెవెరే(39) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మరుమణి(27), బర్ల్‌(26) రాణించారు. భారత బౌలర్లలో మయాంక్‌ యాదవ్‌, ప్రిన్స్‌ యాదవ్‌ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. శివమ్‌ దూబే, బిష్ణోయ్‌ తలా వికెట్‌ సాధించారు.

వరుసగా రెండు వికెట్లు
ఆఖరి ఓవర్‌లో జింబాబ్వే వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. రెండో బంతికి మధెవెరే(39), మూడో బంతికి ఎవాన్స్‌(0) ఔటయ్యారు.

ఐదో వికెట్‌ డౌన్‌
13.1: రవి బిష్ణోయి బౌలింగ్‌లో తిలక్‌ వర్మకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగిన బర్ల్‌ (26). మెధెవెరె 8 పరుగులతో ఉండగా.. స్కోరు: 64-5.  మరుమాణి క్రీజులోకి వచ్చాడు.

పది ఓవర్లలో జింబాబ్వే స్కోరు: 46-4 (10)
మెధెవెరె 5, బర్ల్‌ 12 పరుగులతో ఉన్నారు.

నాలుగో వికెట్‌ డౌన్‌
జింబాబ్వే నాలుగో వికెట్‌ కోల్పోయింది. శివమ్‌ దూబే బౌలింగ్‌లో సికిందర్‌ రజా(4) ఔటయ్యాడు. మెధెవెరె క్రీజులోకి వచ్చాడు.

పవర్‌ ప్లేలో జింబాబ్వే స్కోరు: 26-3 (6)
బర్ల్‌ 1, రజా 4 పరుగులతో ఉన్నారు.

పీకల్లోతు కష్టాల్లో జింబాబ్వే
జింబాబ్వే మూడో వికెట్‌ కోల్పోయింది. మయాంక్‌ యాదవ్‌ బౌలింగ్‌లో డియాన్‌ మైర్స్‌(6) ఔటయ్యాడు. మయాంక్‌కు ఇది రెండో వికెట్‌ కావడం గమనార్హం. 5 ఓవర్లకు జింబాబ్వే స్కోర్‌: 21/2

జింబాబ్వే రెండో వికెట్‌ డౌన్‌
జింబాబ్వే రెండో వికెట్‌ కోల్పోయింది. 10 పరుగులు చేసిన బెన్‌ కర్రాన్‌.. ప్రిన్స్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు జింబాబ్వే స్కోర్‌: 20/2

తొలి వికెట్‌ కోల్పోయిన జింబాబ్వే
భారత బౌలింగ్‌ అటాక్‌ ఆరంభించిన మయాంక్‌ యాదవ్‌ బౌలింగ్‌లో తొలి బంతికే... వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌కు క్యాచ్‌ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగిన బ్రియాన్‌ బెన్నెట్‌ (0). క్రీజులోకి డియాన్‌ మైర్స్‌. జింబాబ్వే స్కోరు: 6-1 (1). బెన్‌ కర్రాన్‌ సున్నా, డియాన్‌ మైర్స్‌ ఆరు పరుగులతో ఉన్నారు.

అశోక్ శ‌ర్మ అరంగేట్రం
రాజ‌స్తాన్ పేస‌ర్ అశోక్ శ‌ర్మ ఈ మ్యాచ్‌తో భార‌త్ త‌ర‌పున అరంగేట్రం చేశాడు. అదేవిధంగా యువ పేసర్‌ మయాంక్‌ యాదవ్‌ దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. మరోవైపు యువ ఆటగాళ్లు న్యూమాన్ న్యామ్‌హురి, బెన్ కరన్ జింబాబ్వే తరపున డెబ్యూ చేశారు.

తుది జట్లు
జింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, తడివానాషే మారుమణి(వికెట్ కీప‌ర్‌), బెన్ కర్రాన్, డియాన్‌ మైర్స్‌, సికందర్ రజా(కెప్టెన్‌), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్‌హురి, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ

భారత్ : వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీప‌ర్‌), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్‌), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)