Breaking News

సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌.. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా

Published on Thu, 11/06/2025 - 09:48

బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ గ్రౌండ్‌-1లో ఇవాళ (నవంబర్‌ 6) భారత్‌-ఏ, దక్షిణాఫ్రికా-ఏ (India A vs South Africa A) జట్ల మధ్య రెండో అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ మార్కస్‌ ఆకెర్‌మన్‌ టాస్‌ గెలిచి టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో చాలామంది టీమిండియా స్టార్లు బరిలోకి దిగుతున్నారు.

కేఎల్‌ రాహుల్‌, అభిమన్యు ఈశ్వరన్‌ ఓపెనింగ్‌కు దిగగా.. సాయి సుదర్శన్‌, దేవదత్‌ పడిక్కల్‌, దృవ్‌ జురెల్‌, రిషబ్‌ పంత్‌, హర్ష్‌ దూబే, ఆకాశ్‌దీప్‌, కల్దీప్‌ యాదవ్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ ఆతర్వాత స్థానాల్లో రానున్నారు.  

సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌ నేపథ్యంలో ఆ జట్టులో చోటు దక్కిన ఆటగాళ్లకు ప్రాక్టీస్‌ నిమిత్తం ఈ అవకాశం ఇచ్చారు. మరోవైపు దక్షిణాఫ్రికా-ఏ తరఫున ఆ జట్టు టెస్ట్‌ కెప్టెన్‌ టెంబా బవుమా సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగాడు. సౌతాఫ్రికా టెస్ట్‌ జట్టులోకి ప్రెనేలన్‌ సుబ్రాయన్‌ కూడా ఈ మ్యాచ్‌ ఆడుతున్నాడు.

రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌-ఏ తొలి మ్యాచ్‌ గెలిచిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌ (90) ఛేదనలో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి భారత్‌ను గెలిపించాడు. ఇవాళ మొదలైన మ్యాచ్‌లో కూడా పంత్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇంగ్లండ్‌లో గాయపడిన తర్వాత పంత్‌ ఆడుతున్న తొలి సిరీస్‌ ఇదే.

ఆదిలోనే షాక్‌
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ మొరేకీ బౌలింగ్‌లో డకౌటయ్యాడు. కేఎల్‌ రాహుల్‌కు జతగా సాయి సుదర్శన్‌ క్రీజ్‌లోకి వచ్చాడు.

ఇండియా A (ప్లేయింగ్ XI): KL రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, దృవ్ జురెల్, రిషబ్ పంత్(w/c), హర్ష్ దూబే, ఆకాష్ దీప్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

దక్షిణాఫ్రికా A (ప్లేయింగ్ XI): జోర్డాన్ హెర్మాన్, లెసెగో సెనోక్వానే, టెంబా బావుమా, జుబేర్ హంజా, మార్క్వెస్ అకెర్‌మాన్ (సి), కానర్ ఎస్టర్‌హుయిజెన్ (w), టియాన్ వాన్ వురెన్, కైల్ సిమండ్స్, ప్రేనెలన్ సుబ్రాయెన్, షెపో మోరేకి, ఒకుహ్లే సెలె

చదవండి: చరిత్ర సృష్టించిన మిచెల్‌ సాంట్నర్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)