Breaking News

శ్రీలంక పర్యటనకు భారత జట్టు ఎంపిక నేడే? అతడు రీ ఎంట్రీ ఇస్తాడా?

Published on Tue, 07/16/2024 - 11:00

జింబాబ్వేతో టీ20 సిరీస్‌ను ఘనంగా ముగించిన టీమిండియా.. ఇప్పుడు శ్రీలంక పర్యటనకు సిద్దమవుతోంది. ఈ టూర్‌లో భాగంగా భారత్‌ ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. పల్లెకెలె వేదిక‌గా జూలై 27న జ‌ర‌గ‌నున్న తొలి టీ20తో టీమిండియా ప‌ర్య‌ట‌న ప్రారంభం కానుంది. 

కాగా శ్రీలంక‌తో ప‌రిమిత ఓవ‌ర్ల సిరీస్‌ల‌కు భార‌త జ‌ట్టును బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ మంగ‌ళ‌వారం(జూలై 16) ఎంపిక చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అజిత్ అగర్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ వర్చువల్‌గా మంగళవారం సాయంత్రం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

ఈ జట్టు ఎంపికలో భారత కొత్త హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కూడా పాల్గోనున్నట్లు సమాచారం. ఇక లంక పర్యటనకు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాకు సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

టీ20 క్రికెట్‌కు ఇప్పటికే గుడ్‌బై చెప్పిన రోహిత్‌, విరాట్‌, జడేజా.. ఇప్పుడు లంకతో వన్డే సిరీస్‌కు కూడా దూరంగా ఉండనున్నారు. అయితే ఈ సిరీస్‌కు స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా దూరం కానున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.  ఈ క్రమంలో శ్రీలంక పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌లకు ఇద్దరు వేర్వేరు కెప్టెన్‌లను సెలక్టర్లు ఎంపిక చేయనున్నట్లు వినికిడి.

అదే విధంగా టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ ఆదేశాలను దిక్కరించి జట్టుకు దూరంగా ఉంటున్న అయ్యర్‌.. ఇప్పుడు గంభీర్ రాకతో అతడి ఎంట్రీ సుగమైనట్లు క్రికెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ఐపీఎల్‌-2024 ఛాంపియన్స్ నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు అయ్యర్ సారథ్యం వహించగా.. గంభీర్ మెంటార్‌గా పనిచేశాడు.
 

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)